కూటమి ప్రభుత్వంలో ప్రజా సమస్యల పరిష్కరానికి ప్రాధాన్యత : మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ

వీ డ్రీమ్స్ అనకాపల్లి

గ్రామాలలో మౌలికవసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్ద పీట
అర్హులైన పేదలందరికి త్వరలోనే పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తాం
రీ-సర్వే అర్జీలపై, భూ సమస్యలపై రెవెన్యూ అధికారులు అలసత్వం వహిస్తే ఉపేక్షించం మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ హెచ్చరించారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

అనారోగ్యానికి గురైన టీడీపీ శ్రేణులు నుండి సీఎం సహాయ నిది దరఖాస్థులు స్వీకరణ రాష్ట్రంలో ప్రతి ఇంటికి పెద్ద కొడుకు చంద్రబాబు నాయుడు అని అన్నారు. నియోజకవర్గం నుంచి వచ్చిన ప్రజలు నుండి టీడీపీ శ్రేణుల నుండి వినతులు స్వీకరించారు. అధికారులతో రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్, మాజీ శాసనసభ్యులు, అనకాపల్లి నియోజవర్గం టిడిపి ఇంచార్జ్ పీలా గోవింద సత్యనారాయణ మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంత్రి నారా లోకేష్ ,టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఆదేశాలతో తెలుగుదేశం పార్టీ ఇన్చార్జుల ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై గ్రీవెన్స్ సెల్ అనకాపల్లి నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్చార్జ్, రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రీవెన్స్ సెల్ కు ప్రజలు వివిధ సమస్యలపై వ్రాత పూర్వకంగా ఆర్జీలు సమర్పించారు.ఈ సందర్బంగా అనకాపల్లి నియోజకవర్గంలో పలు గ్రామాలలో సామాజిక భవనాలను నిర్మించాలని వారిని కోరగా మాజీ మంత్రి శాసన సభ్యులు కొణతాల రామకృష్ణ , పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ సహకారంతో కృషి చేస్తామని అన్నారు.అంతేకాకుండా అనకాపల్లి మండలంలోని పలు గ్రామాలలో రోడ్లు,కాలువలు నిర్మించాలని కోరారు.కశింకోట మండలంలోని గ్రామంలో ఇళ్లపై విద్యుత్ తీగలు ఉన్నాయని తొలగించాలని కోరగా ఆయన RECS అధికారులతో మాట్లాడారు.అనకాపల్లి మండలంలో పలు గ్రామాలలో వాటర్ సమస్య పై, వాటర్ ట్యాంక్ సమస్యలపై పరిష్కరించాలని కోరారు. అంతేకాకుండా అనకాపల్లి మండలంలోని గ్రామాలలో హై మాక్స్ లైట్లు ఏర్పాటు చేయాలనీ గ్రామ టీడీపీ నాయకులు కోరగా ఏర్పాటుకు కృషి చేస్తామని అన్నారు.పాస్ పుస్తకాల కోసం అనకాపల్లి మండలానికి చెందిన రైతులు వారికి పిర్యాదు చేయగా ఆయన తహసీల్దార్ తో మాట్లాడి వెంటనే పాస్ పుస్తకాలను మంజూరు చేయాలనీ కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరగకుండా ప్రజలకు సేవ చేయాలని సదుద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు ఈ కార్యక్రమం ప్రవేశపెట్టారనిఈ సమస్యలన్నిటిని కంప్యూటర్లో పొందుపరిచి సంబంధిత అధికారులకు పంపి పరిష్కారం అయ్యే విధంగా తగు చర్యలు తీసుకుంటానని అన్నారు. అంతేకాకుండా APTIDCO గృహాలను అర్హులైన ప్రభుత్వానికి DD కట్టిన లబ్దిదారులకు కేటాయిస్తామని అన్నారు. సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని సంక్షేమం, అభివృద్ధి వైపు తీసుకువెళ్తున్న ఘనత నారా చంద్రబాబు , పవన్ కళ్యాణ్ దే అని అన్నారు.కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలను 100 శాతం అమలుపారుస్తాం అని అన్నారు. అంతేకాకుండా రేషన్ కార్డులు, ఇండ్ల స్థలాలు, పింఛన్లు, CC రోడ్లు, కాలువల కోసం వినతులు అందజేయాగ మాజీ మంత్రివర్యులు,శాసన సభ్యులు కొణతాల రామకృష్ణ ,పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ళ సురేంద్ర ,రాష్ట్ర SC కార్పొరేషన్ డైరెక్టర్ సబ్బవరపు గణేష్, మండల టీడీపీ అధ్యక్షులు కర్రీ వెంకట సన్యాసి నాయుడు (బాబీ), జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి బోలిశెట్టి శ్రీనివాసరావు, పోలారపు త్రినాధ్,క్లస్టర్, యూనిట్, బూత్ ఇంచార్జిలు,పెద్ద ఎత్తున ప్రజలు, టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *