వీ డ్రీమ్స్ అనకాపల్లి
జీవీఎంసీ అనకాపల్లి గవరపాలెం చిన్న హై స్కూల్ 1982- 83 పదవ తరగతి బ్యాచ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం అనకాపల్లి మండలం భట్లపూడి గ్రామంలో ఆదివారం నిర్వహించారు. చిన్న హైస్కూల్లో 1982-83లో పదో తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు అంతా ఒకేచోట కలుసుకొని ఉదయం నుంచి సాయంత్రం
వరకు ఆట పాటలతో ఉత్సాహంగా గడిపారు. వివిధ ప్రాంతాలలో వివిధ వృత్తులలో స్థిరపడిన వీరంతా ఒకేచోట కలుసుకొని చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు. మధ్యాహ్నం అంతా కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. వీరంతా ఒకరి యోగ క్షేమాలు ఒకరు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఈ బ్యాచ్ కి చెందిన శ్రీ గౌరీ పిఎసిఎస్ డైరెక్టర్ కాండ్రేగుల నూకేశ్వరరావు (చిన్న), ప్రముఖ శిల్పి విల్లూరి పరమేశ్వరరావు, ఇండియన్ రైల్వే ఇంజనీర్ కొణతాల శివ సత్యనారాయణ, అనకాపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోవాడ రాజు లను సాలువాలతో పూలమాలలు వేసి మెమొంటోలు అందజేసి ఘనంగా సత్కరించారు. కొణతాల సూర్య జగ్గారావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో కాండ్రేగుల వెంకటరావు, కర్రి చిన్న అప్పలనాయుడు, ఆడారి బుజ్జి, వెంకట అప్పారావు, రామారావు, కొణతాల రామన్, విల్లూరి శ్రీనివాసరావు, కొణతాల రామకోటి, మద్దాల కనకారావు, న్యాయవాది బుద్ధ బలరామ శ్రీనివాసరావు, విల్లూరి రాముడు తదితరులు పాల్గొన్నారు.

