నేచర్ వెల్పేర్ కౌన్సిల్ అనకాపల్లి జిల్లా అధ్యక్షులుగా గొందిన భక్త సాయిరాం

వీ డ్రీమ్స్ అనకాపల్లి

ప్రకృతి పరిరక్షణ, పర్యావరణ సమతుల్యత, పంచభూతాల సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించుట కొరకు జాతీయ స్థాయిలో 2025 సంవత్సరంలో స్థాపించబడిన సంస్థే ” నేచర్ వెల్పేర్ కౌన్సిల్” (NWC) , ఈ సంస్థ పూర్తిగా రాజకీయాలకు అతీతమైన సంస్థ , ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వ-సామాజిక సంస్థల సమన్వయంతో ముందుకు సాగే సంస్థ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేచర్ వెల్పేర్ కౌన్సిల్ సంస్థాగత విస్తరణలో భాగంగా రాష్ట్ర అధ్యక్షులు అంబటి నవ కుమార్ గారు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల అధ్యక్షులను నియమించడం జరిగింది. ఈ నియామకంలో భాగంగా అనకాపల్లి జిల్లా అధ్యక్షులుగా నన్ను గొంతిన భక్త సాయిరామ్ ని నియమించారు. నాకు ఇచ్చిన ఈ బాధ్యత ద్వారా జిల్లా వ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో చైతన్యం పెంచడం మరియు పంచభూతాల సంరక్షణ (గాలి, నీరు, నేల,అగ్ని, ఆకాశం) పట్ల విద్యార్థుల్లో అవగాహన కల్పించడం ,మొక్కలు పెంచడం ద్వారా సోషల్ ఫారెస్ట్ పెంపొందించడానికి నా శక్తివంచనలేకుండా కృషి చేస్తానని తెలియజేస్తూ ఈ బాధ్యతకు నన్ను నియమించిన రాష్ట్ర అధ్యక్షులు అంబటి నవ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *