రైతులను నిండా ముంచేమరో పూలింగ్”:

(వీ డ్రీమ్స్ ,అనకాపల్లి)
గత ప్రభుత్వంలో లాండ్ పూ లింగ్ లో స్వాధీనం చేసుకున్న భూముల క్లైయుములు ఇంకా పరిష్కారం కాలేదు:
బాధితులు కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు:
ఫ్రీ హోల్డ్ అన్నారు,కాదన్నారు. కూటమి ప్రభుత్వం కూడా పూ లింగ్ పేరు తో రైతుల గొంతు కోయడానికి సిద్దం అవుతోందని
లాయర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అజయ్ కుమార్ విమర్స లు కురిపిస్తున్నారు. పూ లింగ్ దందా గురించి ఆయన మాటల్లోనే:
పేదలకు ఒక సెంటు ఇంటి పట్టా ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేస్తామనే పేరుతో అనకాపల్లి రెవెన్యూ డివిజన్లో ముఖ్యంగా అనకాపల్లి మండలంలో పెద్ద ఎత్తున దళిత బహుజనులకు ఇచ్చిన D ఫారం పట్టా భూములను ప్రభుత్వం నయానా భయాన స్వాధీనం చేసుకోంది. డి పట్టా ఉన్నవారికి తొమ్మిది వందల చదరపు గజాలు, ఆక్రమణలో ఉన్న వారికి 450 చదరపు గజాల భూమిని వాణిజ్య స్థలాలుగా మార్చి, పూర్తి జరాయితి హక్కులతో ఇవ్వడంతో పాటు, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని అరచేతిలో వైకుంఠం చూపించింది.
గత ప్రభుత్వం ఇచ్చిన మాటలు నమ్మి D ఫారం పట్టా భూములను ప్రభుత్వానికి అప్పగించి తమకు ఇస్తానన్న 900 చదరపు గజాల కోసం కార్యాలయాలు చుట్టూ ఇప్పటికీ తిరుగుతూనే ఉన్నారు. ఎన్నికల సమయంలో ఈ భూమి కుంభకోణాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుని లబ్ధి పొంది అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఒక సంవత్సరం తిరిగేసరికి 2020 జనవరి 25వ తారీఖున జగన్ ప్రభుత్వం ఇచ్చిన GO 72ను తిరగదొడి, అనకాపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలో 1940 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవడం కోసం గత నెల జూలై 30వ తేదీన GO 146 ఇచ్చింది. గత ప్రభుత్వం ఇచ్చిన GOకు కోన సాగింపుగా దీనిని ప్రస్తావించడం విశేషం. ఈ ప్రభుత్వ ఉత్తర్వులో ఎలాంటి కొత్త హామీలు లేవు. ఇది పాత జీవో కు కొనసాగింపు మాత్రమే.
ల్యాండ్ పూలింగ్ పేరుతో గత ప్రభుత్వంలో జరిగిన భూ అక్రమాలను ఎన్నికల సమయంలో ప్రచారస్త్రంగా వాడుకుని తీరా గద్దె ఎక్కిన తర్వాత అదే GOను నెంబరు మార్చి ఇవ్వడం ప్రజలను మోసం చేయడమే.
అనకాపల్లి, సబ్బవరం మండలాలలో దళిత, బహుజనులకు ఇచ్చిన D ఫారం పట్టా భూములను స్వాధీనం చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనకాపల్లి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ను ప్రత్యేక అధికారిగా నియమించింది. గతంలో అనకాపల్లి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ గా పనిచేసిన అధికారులు భూములు ఇచ్చేంతవరకు పేదలకు అరచేతిలో వైకుంఠం చూపించారు. పేదల నుండి స్వాధీనం చేసుకున్న భూములలో కట్టిన అగ్గిపెట్టెలు వంటి ఇల్లు ఖాళీగా ఉన్నాయి. అవి నివసించడానికి ఏ విధంగానో పనికి రాకుండా ఉన్నాయి. దాంతో అనకాపల్లి మండలం సంపతిపురం, వేట జంగాలపాలెం, కొంచంగి, కుండ్రo, సీతానగరం రెవెన్యూ గ్రామాలలో నిర్మించిన వందలాది ఇల్లు వ్యర్థంగా పడి ఉండి ఎండకు ఎండి వానకు తడుస్తూ మరో సంవత్సరానికి కూలిపోవడానికి సిద్ధమవుతున్నాయి. కోట్లాది రూపాయల ప్రజాధనం వ్యర్థం చేయడంతో పాటు, అత్యంత విలువైన పేదల భూములను ఎందుకు పనికి రాకుండా గత ప్రభుత్వం మార్చింది. గత ప్రభుత్వం లోపాల నుండి ఎలాంటి గుణపాటాలు నేర్చుకోలేదని ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 146 ను చూస్తే సులువుగా అర్థం అవుతుంది.
D ఫారం పట్టాదారులకు ప్రభుత్వం నుంచి జరాయితి హక్కులతో ఇవ్వవలసిన 900 చదరపు గజాల భూములు ఒకేచోట వచ్చేలా చూసుకోవడం ద్వారా వాటిని కొనుగోలు చేసి ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన భూమాఫియా లబ్ది పొందింది. ఇప్పుడు అదే ఎత్తుగడతో కొత్త ప్రభుత్వంలో ఉన్న నాయకులు లబ్ధి పొందడం కోసమే తిరిగి ల్యాండ్ పూలింగ్ ను రంగం మీదకు తీసుకు వచ్చారు.
గ్రామీణ పేదలకు ఇచ్చిన ప్రభుత్వ బంజరు భూములను స్వాధీనం చేసుకోవడానికి వివిధ రూపాల్లో చేస్తున్న ప్రయత్నాలను ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తుంది. తక్షణం GO నెంబర్ 146 ను రద్దు చేయాలని పిగ్స్ కుమార్ డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *