పి.జి.ఆర్.ఎస్. పెండింగు అర్జీలను వెంటనే పరిష్కరించాలి : జిల్లా కలెక్టరు విజయ కిృష్ణన్

వీ డ్రీమ్స్ అనకాపల్లి

పి.జి.ఆర్.ఎస్. అర్జీలపై నిర్ణీత గడువులోగా చర్యలు తీసుకోవాలని, పెండింగు అర్జీలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టరు విజయ కిృష్ణన్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (పి.జి.ఆర్.ఎస్.) కార్యక్రమంలో జిల్లా విజయ కిృష్ణన్, జిల్లా రెవిన్యూ అధికారి వై. సత్యనారాయణరావు, ఎస్డీసీ రమామణి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టరు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (పి.జి.ఆర్.ఎస్.) కార్యక్రమంలో వచ్చిన అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు. డివిజను, మండల స్థాయిలో నిర్వహించే పి.జి.ఆర్.ఎస్. కార్యక్రమంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటుచేయాలని, వచ్చిన ప్రతి అర్జీని ఆన్లైన్ చేసి, రశీదు అందించాలని తెలిపారు. అదికారులు అర్జీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలని, అర్జీదారునితో స్వయంగా మాట్లాడాలన్నారు. అర్జీలు పెండింగు లేకుండా చర్యలు తీసుకోవాలని, అర్జీలకు పరిష్కారం చూపడమేకాకుండా, పరిష్కారం కాని ధరఖాస్తులకు వివరంగా సమాధానం తెలియజేయుట ద్వారా ఐ.వి.ఆర్.ఎస్. లో ప్రజాభిప్రాయం సంతృప్తికరంగా వచ్చే విధంగా పనిచేయాలని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *