వీ డ్రీమ్స్ అనకాపల్లి
పెద్ద సమస్యగా మారిన ప్రజా సమస్యల వేదిక
పట్టువదలని విక్రమార్కుడిలా రైతులు
పీడిస్తున్న రెవెన్యూ అధికారులు
ఎమ్మెల్యేలు తదితర ప్రజాప్రతినిధుల సహకారం తో ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి లో జరిగిన
అనకాపల్లి జిల్లా అభివృద్ధి సమావేశంలో జిల్లా కలెక్టర్కు స్పష్టంగా చెప్పారు. అనకాపల్లి జిల్లా
ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో రెవెన్యూ సమస్యలు పరిష్కారం కావడం లేదని ప్రభుత్వానికి ఐ.వి.ఆర్.ఎస్ తదితర మార్గాల ద్వారా ఫిర్యాదులు అందుతున్నందున ముఖ్యమంత్రి ఈ ఆదేశాలు ఇచ్చారని తెలియ వచ్చింది.
పి జి ఆర్ ఎస్ ద్వారా సమర్పించిన అర్జీలు పరిష్కారానికి నోచుకోవడం లేదని అనేకమంది సర్పంచులు కలెక్టర్కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోతోంది.
గత ప్రభుత్వం హయంలో రైతులకు జరిగిన అన్యాయాలను సరి ది ద్దుతామని, మిగతా రెవిన్యూ సమస్యలను అన్నింటిని పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి రెవెన్యూ మంత్రి పదేపదే చెప్తున్నందున ప్రతి సోమవారం రైతులు పెద్ద సంఖ్యలో అర్జీలను పిజిఆర్ఎస్లో సమర్పిస్తున్నారు. జిల్లా కలెక్టర్ వారం వారం పిజిఆర్ఎస్ లో సమస్యలు పరిష్కారానికి పాటుపడుతున్నట్లు ప్రకటనలు ఇవ్వడం, అధికారులు క్షేత్ర పర్యటనలు చేయాలని అర్జీలు పునరావృతం కారాదని, పేర్కొంటూ వారం వారం సూచనలు ఇవ్వడంతో రైతులు పీజిఆర్ఎస్ పై నమ్మకంతో ప్రతివారం పెద్ద సంఖ్యలో కలెక్టరేట్ ను సందర్శించుకుంటున్నారు.
సమస్యల సత్వర పరిష్కారానికి కొత్తగా ఏర్పాటైన రివ్యూ క్లినిక్లు హాస్యాస్పదంగా తయారయ్యాయి. తాసిల్దార్లు ఈ క్లినిక్ లకు హాజరై అక్కడికక్కడే నిర్ణయాలు తీసుకుంటారని మొదట్లో చెప్పారు. కానీ తాసిల్దార్లు ఈ క్లినిక్ లకు హాజరు కావడం లేదు. ఇద్దరు ముగ్గురు డిప్యూటీ తాసిల్దారులను హాజరపరిచి , పరిశీలించండి అంటూ వారి చేతికి రెవెన్యూ అధికారులు అర్జీలను ఇస్తున్నారు వారు వాటిని తీసుకుని తాసిల్దారులను కలవండని రైతులకు చెప్పి పంపేస్తున్నారు.. సోమవారం పీజిఆర్ఎస్ జరిగితే మంగళవారం తాసిల్దార్ లు క్షేత్ర పర్యటనకు వెళ్లి దరఖాస్తుదారులతో క్షేత్రస్థాయిలోనే సమస్యలకు పరిష్కారం కనుగొనాలి. కానీ తాసిల్దార్లు మండల కేంద్రాలకు పక్కనే ఉన్న ఒకటి అర గ్రామాలను సందర్శించి కలెక్టర్ తో కాన్ఫరెన్స్ ఉన్నందున తర్వాత కలియండి అని చెప్పి రైతులను పంపేస్తున్నారు.
ఆర్డీవోకు, జేసీ ,కలెక్టర్లకు మాత్రం నివేదికలు టన్చన్ గా పంపిస్తున్నారు. ఏవో కొరీలు వేసి రైతులను అగచాట్లకు గురిచేస్తున్నారు. ముడుపులు చెల్లించిన వారికి మాత్రమే పనులు చేసి పెడుతున్నారు. రెవిన్యూ క్లినికల్ లో వచ్చిన అర్జీలకు సైతం మూడు నెలలు నాలుగు నెలల సమయం గడువుగా ప్రకటించడం మరింత విస్మయకరం. అంశాల వారీగా వచ్చిన అర్జీలు ఎన్ని? వాటిలో ఎన్ని పరిష్కారం అవుతున్నాయి? ఎందుకు కొన్ని పరిష్కారం కాకుండా ఉండిపోతున్నాయి?? వాటి పై వచ్చిన కోరీలు వాస్తవమైనవా అని పరిశీలించే నాధుడే కలెక్టరేట్లో లేకపోవడం వల్ల ఈ కార్యక్రమం నానాటికి ప్రాధాన్యం కోల్పోతోంది. కార్యక్రమాల్ని పెట్టామంటే పెట్టామనే కానీ రాష్ట్రస్థాయిలో సరైన అజమాషి లేకపోవడం పెద్ద లోపం. తాసిల్దారులు డబ్బులు ఇస్తేనే గాని పనులు చేయడం లేదనే భావనతో తాసిల్దార్ కార్యాలయాల్లో సోమవారం జరిగే పిజిఆర్ఎస్ కార్యక్రమానికి ఇప్పటికే వెళ్లడం మానుకున్నారు. కలెక్టరేట్లో జరిగే పి జి ఆర్ ఎస్ కార్యక్రమాల్లో తమ పనులు జరగకపోతే రైతులు అక్కడకు కూడా వెళ్లడం మానుకుంటారు.
భూ సమస్యలపై ఎవరెన్నిసార్లు అర్జీలు అందజేసినప్పటికీ రెవెన్యూ సిబ్బంది మాత్రం సరైన సమాధానం చెప్పకుండా దాటవేసే పద్ధతిలో వ్యవహరించడం విమర్శకు గురవుతోంది.
తమ భూములు 22ఏలో తప్పుగా నమోదయ్యాయని ప్రజలు ఇచ్చిన వినతుల జోలికి రెవెన్యూ వెళ్లడమే లేదు
వెబ్ ల్యాండ్ లో సాంకేతిక సమస్యలు ఇతర కుంటి సాకులు చూపి భూ సమస్యలపై అందిన అర్జీలకు రెవెన్యూ సిబ్బంది పరిష్కారం చూపకుండా తాత్సారం చేస్తున్నారు దరఖాస్తులను ఆన్లైన్లో అప్లోడ్ చేసి కలెక్టర్ ద్వారా సంబంధిత మండల తాసిల్దార్ల పరిశీలనకు పంపినా వాటి గతి ఏమైందో తెలుసుకొనే అధికారులు లేరు. 22a నిషేధిత భూముల జాబితా లో చేరిన ప్రైవేటు జిరాయితీ భూముల సమస్యపై తాజాగా ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను ఈ జిల్లాలో పక్కన పెట్టేశారు. తాసిల్దారులు తమ స్థాయిలో ఉన్న సమస్యలకుపరిష్కారం చూపే అవకాశం ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదు వారసత్వంగా వచ్చిన భూముల వివరాలు, మ్యుటేషన్ లు, పట్టాదారు పాస్ పుస్తకం లో భూమి విస్తీర్ణం తప్పుగా నమోదు కావడం వాస్తవ భూమి యజమాని పేరుకు బదులు ఇతరుల పేర్లు నమోదు కావడం వంటి చిన్నపాటి సమస్యలకు తాసిల్దారులు పరిష్కారం చూపడం లేదు.
ఈ కారణంగా ప్రతి గ్రామంలోనూ రెవిన్యూ బ్రోకర్లు అవతరించి తాసిల్దారులకు రైతులకు మధ్యవర్తులుగా ఉండి పెద్ద మొత్తంలో సొమ్ము వసూలు చేసి కొంత తాసిల్దార్లకు ఇతర సిబ్బందికి ముట్ట చెబుతున్నారు. పరిస్థితి ఇంత దారుణంగా దిగజారుతున్న ప్రజా ప్రతినిధులు నోరు విప్పడం లేదు. దేవాదాయ శాఖ భూములు, ప్రభుత్వ భూములు ఆక్రమణలపై ఆధారాలతో సహా వార్తలు వస్తున్న అధికారులు వాటిని పూర్తిగా పట్టించుకోవడం మానివేశారు అంతేకాక కొన్నిటిని వారే సెటిల్ చేసి సొమ్ము వెనకేసుకుంటున్నారు. గత ప్రభుత్వం హయాంలో వైసిపి నాయకులు ప్రభుత్వ భూములను హస్తగతం చేసుకుంటే కొందరు కూటమి నాయకులు
వాటి అమ్మకo లో వైసీపీ నాయకులకు అండగా నిలిచి లబ్ధి పొందుతున్నారని ఆధారాలతో సహా ప్రముఖ దినపత్రికల్లో వార్తలు వచ్చిన ఎవరు స్పందించకపోవడం బాధాకరం


