పరిష్కారం కాని ప్రజా సమస్యల వేదిక

(వీడ్రీమ్స్ గ్రౌండ్ రిపోర్ట్)

ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రతీ సోమవారం నిర్వహిస్తున్న
ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనకాపల్లి జిల్లా లో అధికారుల మొక్కుబడి కార్య క్రమం గా తయారైంది.

జిల్లా కలెక్టర్ ,జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగే ఈ
కార్యక్రమం సమర్ధం గా జరిగితే ప్రజల సమస్యలు తీరి ప్రభుత్వం కు మంచి
పేరు వస్తుంది. గుజరాత్ ముఖ్యమంత్రి గా నరేంద్రమోడీ ఉన్నపుడు ఆ రాష్ట్రం లో
“స్వాగత్ “పేరు తో జరిగే
పీజీ ఆర్ ఎస్ కార్యక్రమం ఆయనకు దేశంలో ఎనలేని మంచి పేరు తెచ్చింది.అంతేకాక సమర్ధం గా, విజయవంతం గా నడుస్తున్న ఈ కార్యక్రమంకు అప్పట్లోనే ప్రతిష్టాత్మక ఐక్యరాజ్య సమితి ఉత్తమ ప్రజా సేవా అవార్డు లభించింది.

అనకాపల్లి జిల్లా లో
సమస్యల పరిష్కారం కై క్షేత్ర స్థాయిలోపర్యటించాలని, అర్జీలు రీ ఓపెన్ అయ్యే దుస్థితి రాకూడదని, పెండింగ్ సమస్యలపై ఎప్పటికప్పుడు సమీక్ష లు నిర్వహించి నివేదికలు సమర్పించాలని అధికారులకు కలెక్టర్ ప్రతీ సోమవారంఉద్బోధిస్తారు. మిగతా అధికారుల మాట అటుంచి అత్యధికంగా అర్జీలు వచ్చే రెవెన్యూ శాఖ అధికారులు ఈ సూచనలను ఖాతారు చేయడం లేదు.జిల్లాలో రెవెన్యూ శాఖ పూర్తిగా కలెక్టర్ ,జాయింట్ కలెక్టర్ల పర్యవేక్షణ కిందనే ఉంటుంది . వారిదే ఈ వ్యవస్థను సరిదిదాల్సిన బాధ్యత. ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ జిల్లాలో రెవెన్యూ సమస్యలు తక్కువగా ఉంటాయో ఆ జిల్లా కలెక్టర్లు బాగా పనిచేస్తున్నట్టు, సమస్యలు ఎక్కువగా ఉంటే వారు పని చేయనట్టే అని వారి కర్తవ్యాన్ని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రెవెన్యూ మంత్రి , సిసిఎల్ఏ కమిషనర్ పదేపదే రెవిన్యూ సమస్యలు పరిష్కరించాలని చెప్తున్నా చెప్పుకోదగ్గ ఫలితం కనిపించడం లేదు.జాయింట్ కలెక్టర్ ఈ సమస్యల పరిష్కారం పై నివేదిక సమర్పించాలని ఒత్తిడి చేసినప్పుడు మాత్రం సమస్యలు పరిష్కారమైనట్లు తప్పుడు నివేదికలిచ్చి తాసిల్దార్ లు చేతులు దులుపుకుంటున్నారు

. కలెక్టరేట్ నుంచి తాసిల్దార్ కు ప్రజా సమస్య అర్జీ చేరిన వెంటనే సంబదిత సమస్య పరిష్కారం కోసం నిర్దిష్ట రూపంలో అర్జీ సమర్పించాలని అర్జీదారునికి సూచిస్తారు. లేదా వీఆర్వో లకు ఎండార్స్ చేస్తారు.ఇలా సూచించిన వెంటనే ఆ సమస్య పరిష్కారమైనట్టు గా నమోదు చేస్తారు. ఆ తర్వాత ఇంక ఆ సమస్యను తాసిల్దార్ లు పట్టించుకోడం లేదు.
ఆరు నెల్లో ఏడాదో తాసిల్దార్ కార్యాలయం చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగి అర్జీ దారులు మరలా కలెక్టర్ కార్యాలయానికి అర్జీలు సమర్పించుకుంటున్నారు. వీఆర్వో ద్వారా తాసిల్దార్లకు ముడుపులులు అందించిన వారికి మాత్రం రెవెన్యూ పనులు చిటికెలో పరిష్కారం అవుతాయన్నది బహిరంగ రహస్యo.

షో మాస్టర్లు

జిల్లా లో ఒక తహసిల్దార్ అత్యధిక క్షేత్ర సందర్శనలు చేస్తారు. ఆ ఫొటోలన్నిటిని అప్లోడ్ చేస్తారు.ఇదంతా కలెక్టర్ మెప్పు పొందేందుకే. ప్రజాసమస్యల పరిష్కారం కోసం కాదు. రీ సర్వే రెవిన్యూ సదస్సులు అన్నింటి లో ను ఆయన పాల్గొన్నారు.ఫోటోలు అప్లోడు చేసి కలెక్టర్ మెప్పు పొందారు. కానీ రీ సర్వే సమస్యలను పూర్తిగా పక్కన పెట్టేశారు. ఈ తాశీల్ధర్ తన రీ సర్వే సమస్య ను పరిష్కరించలేదని ఓ సర్పంచ్
పీజీఆర్ఎస్ ను చివరికి ఎమ్మెల్యే ను ఆశ్రయించవలసివచ్చింది.
రెవెన్యూ పని తీరు కి ఇదొక ఉదాహరణ మాత్రమే. అధికారులకు జవాబుదారీ విధానాన్ని ఫిక్స్ చేయనిదే మంచి ఫలితాలు రావని ముఖ్యమంత్రి చంద్రబాబు తరచూ చెప్తున్నమాట నిత్య సత్యమే!

పీజీఆర్ ఎస్ నిర్వహణ లోపాలు

కలెక్టర్ ,ఆర్డీఓ లు మినహా మిగతా కార్యాలయాల్లో అర్జీలకు ఐడి నంబరు ఇవ్వడం లేదు. ఇక వీటి పరిష్కారం మాట అటుంచి ఇవి ఏమవుతాయన్నది ఎవరూ చెప్పలేరు.
అర్జీ దారులు కలెక్టరేట్ వరకు రానక్కర లేదని సమీప కార్యాలయాల్లో అర్జీలు సమర్పించవచని కలెక్టర్
చెప్తూనే ఉంటారు.కానీ కనీసం ఐడి నంబర్ల ను ఇచ్చే
పద్ధతి ప్రారంభించడం లేదు.
ఈ ఐడీ నంబర్ లేనిదే 1100
టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేసి
అర్జీ పరిస్థితి తెలుసుకునేందుకు వీలుండదు.

ఉదయం 10 నుంచీ మధ్యాహ్నం 2 గంటలవరకు
తహశీల్దార్ లు అర్జీలు స్వీకరించాలి. కానీ మొదటి రెండు మూడు గంటలు కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ పేరిట అర్జీ దారులకు తహశీల్దార్ లు దర్శనం ఇవ్వడం లేదు. ఇంతలో చోటా రాజకీయ నాయకులెవరైనా
వస్తే తలుపులు మూసి వారితో గంటల తరబడి
మాట్లాడతారు. అర్జీదారులు
క్యూ లో ఉండాల్సిందే.
ఇన్ని అవస్థలున్నా పీజీ ఆర్ఎస్ పై ప్రజలకి ఇంకా గట్టి నమ్మకం ఉంది.

ఏం చెప్పమంటావ్ నాకున్న ఎకరాలో అరెకరా 22(ఏ ) లో కలిపేశారు మహాప్రభో అని మొరపెట్టుకుంటే ఉన్న అరెకరా కూడా తీసేసారు!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *