వీ డ్రీమ్స్ విశాఖపట్నం
ఉమ్మడి విశాఖ జిల్లా కు చెందిన 138 మంది గ్రేడు 2 వీఆర్వోలకు గ్రేడ్ వన్ వీఆర్వోలుగా ప్రమోషన్లు లభించాయి. ప్రమోషన్ల కౌన్సిలింగ్ విశాఖ పట్నం కలెక్టరేట్లో జరిగిన సంగతి తెలిసిందే. ప్రమోషన్ల ఉత్తర్వులు అందిన 15 రోజుల్లోగా విధుల్లో చేరాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులో పేర్కొన్నారు.
ఉమ్మడి విశాఖ జిల్లాలో 188 గ్రేడ్ వన్ వీఆర్వో పోస్టుల ఖాళీలుఉన్నాయి. కౌన్సెలింగ్లో 138 మంది విఆర్ఓ లను ప్రమోట్ చేశారు. పాస్ పుస్తకాల పంపిణీ జరిగే గ్రామాల్లో ని విఆర్ఓ లను నెల రోజుల తర్వాత ఆ పోస్టుల నుంచి విడుదల చేస్తారు. గ్రేట్ టు నుంచి గ్రేడ్ వన్ కు అదే మండలంలో ప్రమోషన్ పై వెళ్లిన వీఆర్వోలకు వారు అంతకుముందు పనిచేసిన గ్రామాల బాధ్యత కూడా అప్పగిస్తున్నారు. ప్రమోషన్ల విషయమై కొన్ని కేసులు కోర్టులో ఉన్నందున ఈ ప్రమోషన్లు తాత్కాలిక ప్రాతిపదికపై చేసినవేనని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

