ఏలూరు లో “మనోహరం”మరి మన జిల్లాలో??

వీ డ్రీమ్స్ అనకాపల్లి

అనకాపల్లి జిల్లాలో ఏలూరు జిల్లాలో మాదిరి మెగా 22a రెవెన్యూ సమస్యల పరిష్కార
వేదిక నిర్వహించాలని
జిల్లా రైతాంగం కోరుతోంది.

అనకాపల్లి జిల్లాలో రెవెన్యూ క్లినిక్ లు
ఎలాంటి ఫలితాలు ఇవ్వని
మొక్కుబడి క్లినిక్ ల గానే తయారవడం తో
రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
అనకాపల్లి జిల్లాలో జిల్లా ఇంచార్జి మంత్రి ఈ సమస్యల పరిష్కార మార్గంలో మంత్రి నాదెండ్ల మనోహర్ వలే కృషి చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు
జిల్లా కి వచ్చి అధికారుల తో సమీక్షా సవేశాలు నిర్వ హిస్తే
సరిపోదనీ వారంటున్నారు.కొణతాల రామకృష్ణ, సీఎం రమేష్ , స్పీకర్ అయ్యన్నపాత్రుడు వంటి మహామహులున్న
అనకాపల్లి జిల్లాలో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి
తాసిల్దార్లకు వేలు లక్షలు
సమర్పించుకోవలదిందేనా??
అని జిల్లా రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తున్నది.

ఏలూరు లో మంత్రి నాదెండ్ల మనోహర్ మెగా 22(a) భూ సమస్యల పరిష్కార వేదికను వారం కిందట
నిర్వహించారు. మంత్రి తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ కారణంగా ఈ కార్యక్రమం అద్భుత విజయం సాధించింది.22a నుంచి తొలగించాలని కోరుతూ మొత్తం 1199 దరఖాస్తులు
రాగా వాటిలో1147 దరఖాస్తులను ఒకే రోజు పరిష్కరించారు.143 ఎకరాల భూమికి 22a నుంచి విముక్తి
కలిగింది.
మనోహర్ ఆధ్వర్యం లో విజయ వంతమైన ఈకార్యక్రమాన్ని
సీఎం చంద్రబాబు ప్రశంసించి
అన్ని జిల్లాల్లో అమలు చేయాలని
కలెక్టర్లు ను ఆదేశించారు.
జిల్లా ఇంచార్జి మంత్రి,జిల్లా కలెక్టర్
22ఏ నిషేధిత భూముల పరిష్కార
సదస్సు ను ఎప్పుడు నిర్వహిస్తారా అని బాధిత రైతాంగం ఎదురు చూస్తోంది.
ఇదిలా ఉండగా 22a భూముల
బాధిత రైతాంగం నుంచి లంచాలు
ఆశిస్తున్న రెవెన్యూ అధికారులు
సదస్సు జరగకుండా ఆటంకాలు
కలుగ చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి

ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన పబ్లిక్ గ్రీవెన్స్ లో 22a జాబితా గురించి సమీక్షించిన మంత్రి నాదెండ్ల మనోహర్ (ఫైల్ ఫొటో)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *