రీల్స్ తిప్పడం కాదు పని చేయాలి : జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్

వీ డ్రీమ్స్ అనకాపల్లి

అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ జిల్లా యంత్రాంగం పనితీరు పై శివాలెత్తారు. వివిధ పథకాల అమలులో నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయకుండా విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని , జిల్లాకు చెడ్డ పేరు తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బుధవారం జరిగిన ఓ సమీక్ష సమావేశంలో కలెక్టర్ ఉద్యోగులపై ఉగ్రరూపం దాల్చారు.
సచివాలయ ఉద్యోగుల
పనితీరుపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మొత్తం మీద జిల్లా యంత్రాంగాన్ని పరుగులు తీయించడానికి కలెక్టర్ పూనుకున్నారు.

చాలాకాలంగా సచివాలయ ఉద్యోగుల పై ప్రజల నుంచి పలు విమర్శలు వస్తున్నాయి. ఐ వి ఆర్ ఎస్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు పనితీరుపై సమాచారాన్ని సేకరించి జిల్లాలకు గ్రేడింగ్ ఇస్తోంది. ఈ గ్రేడింగ్లో అవినీతి కారణంగా ఉద్యోగులు జిల్లాకు చెడ్డపేరు తీసుకొస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ఆ రోజుకు ఆరోజే ఐఫోన్ కొనాలి, ఇల్లు కొనాలి కారు కొనాలి
ఇలాంటి దురాశతో అవినీతికి పాల్పడుతూ జిల్లాకు అవినీతిలో 26వ స్థానం సంపాదించి పెట్టారని, ధ్వజమెత్తారు. జిఎస్డబ్ల్యు ఎస్ ఉద్యోగులను తీవ్రంగా హెచ్చరిస్తూ వారికి చెమటలు పట్టించారు .
కాకమ్మ కథలను కట్టిపెట్టి నిర్దేశించిన పనులను శనివారం నాటికి పూర్తి పూర్తిచేసేలా మండల అభివృద్ధి అధికారులు బాధ్యత తీసుకోవాలని నిర్దేశించారు. సచివాలయ ఉద్యోగులు అందుబాటులో ఉన్నారా అంటే లేరు ,వసూళ్లలో
అవును. ఇది మీకు ప్రజలు ఇస్తున్న సర్టిఫికెట్ . ఈ సర్టిఫికెట్ను నెత్తి మీద అంటించుకుని తిర గండని ఘాటుగా వ్యాఖ్యానించారు . ఈ జాతిరత్నాలు అవినీతిలో మన జిల్లాకు 24వ స్థానం తెచ్చారని కలెక్టర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది.
అక్షరాంధ్ర రిజిస్ట్రేషన్స్ లో , యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలో మనమిత్ర వాట్సాప్ సర్వీసులను ప్రచారం చేయడంలో వెనుకబడి ఉండడాన్ని జిల్లా కలెక్టర్ తీవ్రంగా తీసుకున్నారు
పెన్షన్ పంపిణీ ,స్వర్ణాంధ్ర, జి ఎస్ డబ్ల్యూ ఉద్యోగుల పని తీరు ర్యాంకింగ్లను గురించిమాట్లాడుతూ మెరుగు పడకపోతే చర్యలు తప్పమన్నారు. వయోజన విద్యా కేంద్రాలను ఎంపీడీవోలు తో సహా ఏ ఒక్క ఉద్యోగి ఒక్కసారి కూడా సందర్శించక పోవడం కలెక్టర్ ను తీవ్రంగా కలచివేసింది. మనమిత్ర వాట్సప్ సేవల ను ప్రచారం చేయమని ఆదేశిస్తే పంచాయతీ సెక్రటరీలు నిర్లక్ష్వహించారని దీంతో జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా కన్నా వెనుకబడి పోయామని బాధను వ్యక్తం చేశారు.
మనమిత్ర వాట్సాప్ సర్వీసులను గిరిజనులు బాగా ఉపయోగించుకుంటున్నారని, ఈ జిల్లా పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించారు ప్రతి ఒక్కరూ రోజుకి 20 మందికి వాట్సాప్ సర్వీసుల గురించి వివరించి ప్రజలువాటిని బాగా ఉపయోగించేలా చూడాలని ఆదేశించారు. ఈసారి
ర్యాంకింగ్లో డబుల్ డిజిట్ వస్తే సహించేది లేదని హెచ్చరించారు.
బాధ్యతారాఇత్యానికి అలవాటు పడిన ఉద్యోగుల తుప్పు వదిలించేందుకు కలెక్టర్
చేసిన గట్టి హెచ్చరికల పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది
గతంలో ఎన్టీఆర్ ఆసుపత్రి డాక్టర్ ఒకరు అవినీతికి పాల్పడ్డారన్న సమాచారంతో ఆసుపత్రిని సందర్శించిన కలెక్టర్ డాక్టర్ ను సస్పెండ్ చేసి ఆసుపత్రిని ఓ దారికి తెచ్చిన విషయం తెలిసిందే.

మరి’ రెవెన్యూ’ పరిస్థితి ఏమిటి?

రెవెన్యూ శాఖ ఉద్యోగుల పని తీరుపై అన్ని వర్గాల నుంచి తీవ్రమైన విమర్శలు వెలుడుతున్నాయి. ఈ శాఖకు చెందిన కొందరు ఉద్యోగుల్లో విపరీతంగా పెరుగుతున్న అవినీతిని
నిరోధించకపోతే పరిస్థితి చేయి దాటిపోవడమే కాక
రైతుల్లో కూటమి ప్రభుత్వం పట్ల వ్యతిరేకతకు కారణం అవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొన్నందున స్వయంగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగి రెవెన్యూ శాఖ
ప్రక్షాళనకు పూనుకొన్నారు.
తాసిల్దార్లు వీఆర్వోలు ఆడిందే ఆటగా పాడిందే పాటగా చెల్లుబాటు అవుతుంది. రెవెన్యూ పిజిఆర్ఎస్ పిటిషన్లను పట్టించుకున్నట్లు కనిపిస్తారే గాని పరిష్కరించడం లేదు. భూ కబ్జాలు ప్రభుత్వ భూముల ఆక్రమణ లు తదితర అనేక అంశాలపై కలెక్టర్ దృష్టి పెడితే తప్ప ప్రజలకు న్యాయం జరిగేలా లేదు. జిల్లాలో కొంతమంది ఎమ్మెల్యేలు రైతుల గోడు పట్టించుకోవడంలేదని వారు అక్రమార్కుల కొమ్ముకాస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *