వీ డ్రీమ్స్ అనకాపల్లి
భూముల రీ సర్వే పారదర్శకంగా నిర్వహించాలని రీ సర్వే నోడల్ అధికారి కె సూర్యారావు అన్నారు. మంగళవారం ఆయన అనకాపల్లి జిల్లాలోని రాంబిల్లి, అచ్యుతాపురం మండలాల్లో జరుగుతున్న రీ సర్వే గ్రామాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రీ సర్వే జరుగుతున్న తీరును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులను నోటీసులు విషయమై అడిగి తెలుసుకున్నారు. రాంబిల్లి మండలం లోని మన్యపు చింతువ, హరిపురం రెవెన్యూ గ్రామాల పనులను ఆయన పరిశీలించారు. ఈ రీ సర్వేలో రెవెన్యూ సిబ్బంది పనితీరును కూడా గమనించారు. ప్రతి రైతుకు నోటీసులు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. సాగులో ఉన్న రైతులు నుండి భూ రికార్డులు పరిశీలించాలని అన్నారు. ప్రతిరోజు గ్రౌండ్ ట్రూతింగ్ సమయంలో రైతులు భూమ్మీద ఉండి డాక్యుమెంట్లు కలిగి ఉన్న వారికి అదే రోజు న్యూట్రిషన్ చేయాలని ఆదేశించారు. అలాగే రైతులు భూమి మీద ఉండి ఆన్లైన్లో లేకుండా పిత్రార్జితంగా ఆ భూమిని సాగు చేసుకుని ఉంటే నిబంధనలు ప్రకారం మ్యుటేషన్ చెయ్యాలని రీ సర్వే సిబ్బందిని ఆదేశించారు.ఈ పర్యటనలో డిప్యూటీ డైరెక్టర్ సర్వే అండ్ సెటిల్మెంట్ కె
సూర్యనారాయణ, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే డి.వెంకన్న, రాంబిల్లి తాసిల్దార్ అయ్యల శ్రీనివాసరావు, రాంబిల్లి, అచ్యుతాపురం మండల సర్వేలు త్రిమూర్తులు, మోహన్, తో పాటు రీ సర్వే బృందాలు పాల్గొన్నాయి.
