గణతంత్ర వేడుకల్లో డి ఏవి స్కూల్ కి ప్రథమ స్థానం

వీ డ్రీమ్స్ అనకాపల్లి

ఇక్కడ డి ఏ వి పబ్లిక్ స్కూల్ లో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కిరణ్ కుమార్ జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎందరో మహానుభావులు త్యాగాల ఫలితంగా మన దేశ స్వతంత్రం వచ్చిందని అన్నారు. అనంతరం ఆయన వివిధ రంగాలలో ప్రతిభ చూపిన విద్యార్థిని విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో డి ఏవి స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

గణతంత్ర వేడుకల్లో డిఏవికి ప్రత్యేక గుర్తింపు

స్థానిక ఎన్టీ రామారావు స్టేడియంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో అనకాపల్లి డి ఏవి పబ్లిక్ స్కూల్ కల్చరల్ ఆక్టివిటీస్ లో ప్రథమ స్థానం లో నిలిచింది. జిల్లా నుంచి సుమారు 11 స్కూలు విద్యార్థులు ఈ ఘనతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు. వివిధ అంశాలపై కల్చరల్ యాక్టివిటీస్ కార్యక్రమాలు నిర్వహించగా డిఏవి పబ్లిక్ స్కూల్ “ఆపరేషన్ సింధూర్ “అనే ప్రోగ్రాం ని విద్యార్థులు అమోఘంగా ప్రతిభను చూపించారు. మేరకు జిల్లా అధికారులు డి ఏవి పబ్లిక్ స్కూల్ విద్యార్థులకు ప్రథమ స్థానం లో నిలిచింది. గణతంత్ర వేడుకల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు కిరణ్ కుమార్ అభినందించారు అలాగే విద్యార్థుల గెలుపుకు వెన్నంటి నిలిచిన ఉపాధ్యాయులు భవాని, హారిక లను ఆయన అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *