డామిట్ ! కధ అడ్డం తిరిగిందే!!

(వీ డ్రీమ్స్ అనకాపల్లి)

అనకాపల్లి నార్త్ టులో దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్న సర్వేనెంబర్ 1539-5
సుమారు రెండు ఎకరాల 49 సెంట్లు భూమిని గుట్టు చప్పుడు కాకుండా ప్రైవేట్ వ్యక్తులకు కట్ట బెడుతూ రెవెన్యూ తీసుకున్న నిర్ణయం బట్టబయలు కావడంతో తప్పు కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.

దత్తత భూమిలోకి దూరిపోయారంటూ ఓ కథనం సోమవారం వెలువడటంతో ఖo గు తిని డ్యామేజ్ రిపేరు చర్యలకు కలెక్టర్ ఉపక్రమించారు. కథనం వెలవడిన
సోమవారం రాత్రి 8 గంటల 45 నిమిషాలకు ఈ భూమిని వివాదాస్పద భూమి క్యాటగిరిలోకి మారుస్తూ వివాదాస్పద భూముల రిజిస్టర్లో నమోదు చేశారు.
నిషేధిత భూముల జాబితా నుంచి ఈ దేవాదాయ శాఖ దత్తత భూమిని తొలగించడానికి అడ్డదారులన్నీ తొక్కిన రెవెన్యూ తన బండారం బయటపడేసరికి ఉలిక్కిపడి తప్పును తప్పించుకొనే ప్రయత్నం ప్రారంభించిందని తెలియ వచ్చింది. ఈ వ్యవహారంలో తాసిల్దార్ను ,ఆర్డీవోను ఇరికించిన అధికారి వారితోనే తప్పులు దిద్దించడం గమనార్హం.
పేద మధ్యతరగతి రైతుల, సైనికుల భూములను 22ఏలో ఇరికించిన జిల్లా రెవెన్యూ శాఖ ఆ భూములను 22a నుంచి తొలగించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రెవిన్యూ మంత్రి ఇచ్చిన ఆదేశాలను సైతం పక్కన పెట్టి ఎవరు కాసులు ఇస్తే వారి పనులే చేస్తున్నారు. దేవాదాయశాఖ దత్తతలో ఉన్న ఈ భూమి కుంభకోణo పై
రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు
ఈ దత్తత భూమి వ్యవహారం అనేక అనుమానాలకు ఆస్కారం ఇస్తుంది.1539-5 22 (a) జాబితాలోనే కనిపించడం లేదు. ఈ సర్వే నెంబర్ పక్కనే ఉన్న 1539-3 ( కాలువ) మాత్రమే 22(a) కనిపిస్తుంది. ప్రైవేట్ వ్యక్తులకు దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్న భూమిని ధారాధత్తం చేస్తున్నారంటూ వచ్చిన వార్తలపై దేవాదాయ శాఖ అధికారులు ఎలా స్పందిస్తారనే అంశం కీలకంగా మారింది.

అనకాపల్లి నార్త్ 2 లో సర్వే నెంబరు 1359-5 లో 2.49 ఎకరాల భూమిని నిన్న రాత్రి హుటా హుటిన  వివాదస్పద జాబితాలో చేర్చిన రెవెన్యూ అధికారులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *