వీ డ్రీమ్స్ అనకాపల్లి
గత పాలకులహయాంలో అనకాపల్లి జిల్లాలో చక్రం తిప్పిన రెవిన్యూ ముఠా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా తన హవాను కొనసాగిస్తున్నది. ఇక్కడ పని చేసిన ఒక జేసి చలవతో కలెక్టరేట్ లో తిష్ట వేసిన ఈ బృందం కలెక్టర్ కోటరిగా
రెవెన్యూ వ్యవహారాలను చక్కబెడుతోంది. ఈ కోటరీ బాగా బలపడి ఇటు కూటమి అటు వైసిపి లో కొందరు నాయకుల మద్దతు కూడగట్టుకుంది. రెవెన్యూ అక్రమాలకు పాల్పడేవారు ఈ కోటరిని ప్రసన్నం చేసుకుని ఎలాంటి పనినైనా అవలీలగా సాధించ గలుగుతున్నారు. ఇటీవల ఒక జనసేన ఎమ్మెల్యే (అనకాపల్లి కాదు)ఈ కూటమితోను కలెక్టర్ తోను కలిసి ఎలాంటి ఫైలు కైన మోక్షం కలిగిస్తారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి . ఈ ఎమ్మెల్యే చెప్తే కలెక్టర్ ఆ పనిని ఆగ మేఘాల మీద పూర్తి చేస్తారని కలెక్టరేటు వర్గాలే ప్రచారం చేస్తున్నాయి. తమకు ఎదురు లేదని భావించిన ఈ కోటరీ, కలెక్టర్ కలసి ఎమ్మెల్యేల సిఫార్సులను సైతం పక్కన పెట్టేస్తున్నారు. ఎమ్మెల్యేల సొంత పనులు ఏమైనా ఉంటే చెయండి సిఫార్సులను పక్కన పెట్టండి అని ఆదేశాలు ఇచ్చారని కలెక్టర్ పై ఆరోపణలు వినవస్తున్నాయి . కలెక్టర్ తమ మాట వినడం లేదని కినుక వ హించిన ఒక మాజీ ఎమ్మెల్యే ఇటీవల బహిరంగంగానే కలెక్టర్ పై విమర్శలు చేయడం గమనార్హం. ప్రజలు తమ న్యాయమైన రెవెన్యూ సమస్యలను పిజిఆర్ఎస్ ద్వారా పరిష్కారం కాకపోతే ఎమ్మెల్యేలను ప్రజాప్రతినిధులను ఆశ్రయిస్తుంటారు వారు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి సమస్యలను పరిష్కరిస్తుంటారు. ఇప్పుడు ఎమ్మెల్యే చెప్పినాఎవరు చెప్పినా ముడుపులు చెల్లించినదే రెవెన్యూ పనులు పరిష్కారం కాని పరిస్థితి అనకాపల్లిలో నెలకొంది. కోట్ల విలువైన వ్యవహారాల్లో కొందరు ఎమ్మెల్యేలు తల దూర్చి వసూలు చేసిన సొమ్ములో రెవెన్యూ కు కొంత సమర్పించి కొంత వాటా ని వారు దక్కించుకుని పనులను సెటిల్ చేస్తున్నారు.ఇది రైతులకు అనుభవ సత్యమే.
ఫార్స్ గా. పి జి ఆర్ ఎస్ రెవెన్యూ క్లినిక్ లు
పిజిఆర్ఎస్ లో రెవిన్యూ క్లినిక్లలో వచ్చిన రెవెన్యూ సమస్యలు పరిష్కారం కాకుండా పేరుకుపోతున్నాయి. కాళ్లు అరిగేలా తిరిగి చివరకు ముడుపులు చెల్లించి పనులు నెరవేర్చుకుంటున్నారు రైతులు.
ప్రభుత్వ భూముల ఆక్రమణలు, రీ సర్వేలో అవకతవకలు, 22a, మ్యుటేషన్ లు, పాస్ పుస్తకాల జారీ లో విపరీత జాప్యం ,తదితర రెవిన్యూ సమస్యలపై పత్రికలలో వార్తలు వచ్చినా తాసిల్దార్లు బేఖాతరు చేస్తున్నారు. సొమ్ము చెల్లిస్తేనే పని అని బరితెగించి చెప్తున్నారు.భూమి ధర లో కొంత శాతం ను లంచం గా ఇస్తేనే పనులు జరుగుతాయి.భూమి ధరలతో పాటు లంచాలు పెరిగిపోయాయి.ఎమ్మెల్యే లు చెప్పినా లంచం ఇవ్వనిదే పనులు జరగవు. .గతంలో పొరపాట్లు చేస్తే కలెక్టర్ కి ఫిర్యాదులు వెళతాయనే భయం ఉద్యోగులకు ఉండేది. ఇప్పుడు కలెక్టరేటే ముడుపులు మయమై అంతటా అవినీతి రాజ్యమేలుతోంది. రెవెన్యూ అధికారులకు ప్రతి గ్రామం లో ఉండే రెవెన్యూ బ్రోకర్ లు లంచాలు వసూలు చేసి పెడతారు. బీద బిక్కి రైతులను సైతం వీరు కనికరించరు. రీ సర్వే సమయంలో లంచాల బాగోతం బహిరంగంగానే నడుస్తోంది. జగన్ పాలనలో
జరిగిన అనేక అక్రమాలను సరిచేస్తున్నామని కూటమి నేతలు ప్రతిరోజు చెప్తుంటారు కానీ గ్రామస్థాయిలో జరిగిన అనేక అక్రమాలను, రెవెన్యూ అధికారులు సరి చేయడం లేదు. రెవెన్యూ అధికారుల వైఖరి పేద రైతుల్లో గ్రామాల్లో కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచే విధంగా తయారయింది.
కొన్ని జిల్లాల్లో ఎమ్మెల్యేలు మంత్రులు ఇన్చార్జి మంత్రులు రెవెన్యూ శాఖ పనులు ఎలా చేస్తోంది అన్న విషయంపై దృష్టి పెట్టి ప్రజలకు న్యాయం చేస్తున్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ వంటి వారు ఇందుకు ఉదాహరణ. ఆయన ఏలూరు జిల్లాలో ఏళ్ల తరబడి పేరుకుపోయిన 22a సమస్యలను ఒక్కరోజులో 90 శాతం పరిష్కరించారు.
అయితే అనకాపల్లి జిల్లాలో ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులతో పాటు ప్రజా సంఘాలు మూగపోయాయి. పత్రికల్లో ప్రతికూల వార్తలు వస్తే సంబంధిత రెవెన్యూ అధికారులు వివరణలు ఇవ్వనే ఇవ్వరు. విలేకరులు తప్పుడు వార్తలు రాస్తున్నారని ఎక్కడా లేని విధంగా రెవిన్యూ ఉద్యోగుల అసోసియేషన్ పేరిట ఉద్యోగులు అధికారులు రోడ్లపై ధర్నాలకు దిగుతున్నారు
దేవాదాయ శాఖ భూమి వ్యవహారంలో కలెక్టర్ పై విమర్శలు వస్తే కలెక్టర్ రెవిన్యూ ఉద్యోగులను ఉసిగొలిపి ప్రదర్శనలు చేస్తున్నా రో లేదా అసోసియేషన్ నాయకులే కలెక్టర్ ప్రాపకం కోసం బలప్రదర్శనకు దిగుతున్నా రో తేలవలసి ఉంది.
కలెక్టర్ వ్యవహార శైలి తో కినుక వహించిన కొందరు రెవెన్యూ ఉద్యోగులు ఇతర ప్రాంతాలకు బదిలీపై వెళ్లాలని చూస్తున్నారు.
చివరకు రెవిన్యూ ఉద్యోగులు రెండు వర్గాలుగా చీలిపోయారు.
కొందరు ఉద్యోగులు రెండు గ్రూపుల్లోను ఉన్నారు.
దేవాదాయ శాఖ భూమి ప్రైవేటుపరం చేసే వ్యవహారాన్ని కొందరు రెవిన్యూ ఉద్యోగులే మీడియాకు చేరవేసారని
కలెక్టర్ కోటరీ నాయకులు కలెక్టర్ కి నూరి పోస్తున్నా రని తెలియ వచ్చింది.
ఈ గవర్నెన్స్ వట్టిమాటే
అనకాపల్లి జిల్లాలో ఈ గవర్నెన్స్ అమలు కానే కాదు. ఈ గవర్నెన్స్, ఫైల్ ట్రాకింగ్, ఈస్ ఆఫ్ డూయింగ్ వట్టి మాటలు గానే మిగిలిపోయాయి. ముఖ్యమంత్రి రైతులకు మేలు జరిగేలా ఈ గవర్నెన్స్ ను ఉపయోగించమని పదేపదే చెప్తున్నా రెవెన్యూలో పట్టించుకునే నాధుడే లేడు. ఈ గవర్నెన్స్ దొంగలెక్కల తయారీకి ఉపయోగించుకుంటున్నారు.
పిజిఆర్ఎస్ లో అర్జీ ఇవ్వగానే అది సంబంధిత అధికారికి చేరుతుంది అక్కడితో ఆ సమస్య పరిష్కారం అయిపోయినట్టే రికార్డుల్లో చూపిస్తుంటారు.
క్షేత్ర స్దాయి లో పర్యటనలు చేయమని
సమస్యలు పెండింగ్ లో ఉండరాదని మరలా మరలా పిజి ఆర్ఎస్ ఓపెన్ చేయమని దరఖాస్తులు రాకుండా చూడాలని కలెక్టర్ ప్రతి వారం చెప్పిందే చెప్తుంటారు. కానీ ఏ ఒక్క తాసిల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ సందర్శించి ఎన్ని పనులు పూర్తయ్యాయి అనే విషయాన్ని పరిశీలించిందే లేదు. రెవెన్యూ క్లినిక్లలో వచ్చిన ఎన్ని పనులకు పరిష్కారం కనుగొని విజయవంతంగా పూర్తి చేశారో లెక్కలు ప్రెస్ కు ప్రభుత్వానికి చెప్పనే చెప్పరు. అన్ని ప్రభుత్వ శాఖలు సక్సెస్ స్టోరీలను పత్రికలకు ఇస్తుంటాయి కానీ రెవెన్యూ శాఖ ఏనాడు అలాంటి మంచి పనులను చేయనే చేయదు.
( నిబంధల అతిక్రమణ
రెవెన్యూకి మామూలే ….
మరిన్ని రెవెన్యూ లీలలు
వీడ్రీమ్స్ లో చూడండి )

రెవెన్యూ పై రోడ్డున పడిన రెవెన్యూ ఉద్యోగులు
