అక్రమ మద్యం వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్న విశాఖ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్

వీ డ్రీమ్స్ విశాఖపట్నం విశాఖలో ఎక్సైజ్ టాస్ ఫోర్స్ అధికారులు స్పీడ్ పెంచారు. అక్రమ మద్యం దాడుల్లో ఈ శాఖ దూసుకుపోతుంది. గత నెలలో భారీగా మద్యాన్ని పట్టుకున్న విశాఖపట్నం ఎక్సైజ్ టాస్ ఫోర్సు సూపర్డెంట్ ఆర్ ప్రసాద్ వరుస దాడులు జరిపి భారీగా మద్యాన్ని పట్టుకుంటున్న విషయం తెలిసిందే. మద్యం దాడులు చేయడంలో ఈ శాఖ ముందంజలో ఉన్నాదని చెప్పవచ్చు. గత నెలలో దాడులు జరిపి భారీగా మద్యాన్ని స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే అంతేకాకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యోగి దగ్గర భారీగా ఖరీదైన మద్యాన్ని స్వాధీనం చేసుకొని వరుస దాడులు జరిపి సంచలనాన్ని సృష్టిస్తున్నారు. అలాగే ఈ నెలలో నకిలీ మద్యం తయారీ కేంద్రంపై దాడులు జరిపి న విషయం తెలిసిందే తాజాగా దాడులు జరిపి ఆర్మీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు అక్రమ మద్యాన్ని తరలిస్తున్న ఇద్దరిని వీరు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. గాజువాక కి చెందిన నర్సింహారెడ్డి, సుబ్బారావు లను వీరు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని టాస్క్ ఫోర్స్ ఎక్సైజ్ సూపరిండెంట్ సూపరింటెండెంట్ ఆర్ ప్రసాద్ తెలిపారు. ఎవరైనా అక్రమంగా మద్యాన్ని తరలించిన, నకిలీ మద్యాన్ని తయారుచేసిన క్షమించేది లేదని ఆయన హెచ్చరించారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ ఇన్ఫెక్టర్ ఆర్ రవి కిరణ్, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ ముసిలి నాయుడు, హెడ్ కానిస్టేబుల్ కేవీఎం రాజు, కానిస్టేబుల్ కే సతీష్, సిహెచ్ వెంకటేశ్వరరావు, డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో జరిగిన దాడుల్లో అక్రమ మద్యం నిల్వలను స్వాధీనం చేసుకున్న అధికారులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *