వీ డ్రీమ్స్ అనకాపల్లి
జిల్లాలోని ఏడుగురు తాసిల్దార్లను బదిలీ చేస్తూ అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ ఉత్తర్వులు జారీ చేశారు. పాలనా సౌలభ్యం నిమిత్తం వీరిని డిప్యూటేషన్ ప్రాతిపదికన బదిలీ చేస్తున్నట్లు ఆమె తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
రోలుగుంట మండలం తాసిల్దార్ సిహెచ్ నాగమ్మ ను అనకాపల్లి కలెక్టర్ ఆఫీస్ కు కలెక్టర్ కార్యాలయం భూమిభాగం సూపరిండెంట్ పివి రత్నం ను మునగపాక తాసిల్దార్ గా నక్కపల్లి తాసిల్దార్ డి శ్రీనును అచ్చుతాపురం తాసిల్దార్ గా సబ్బవరం తాసిల్దార్ బి చిన్నికృష్ణను నక్కపల్లి తాసిల్దార్ గా బదిలీ చేశారు. ఏఎస్ఆర్ జిల్లా కు చెందిన డి అరుణ్ చంద్రని సబ్బవరం తాసిల్దార్ గాను మునగపాక మండలం తాసిల్దార్ పీ సత్యనారాయణ రాంబిల్లి మండల తాసిల్దార్ గా రాంబిల్లి మండలం తాసిల్దార్ ఏ శ్రీనివాసరావును కలెక్టర్ కార్యాలయం కు డిప్యుటేషన్ ప్రాతిపదికన బదిలీ చేశారు.


