అనకాపల్లి జార్జి క్లబ్ అధ్యక్షునిగా దాడి బుజ్జి ఘన విజయం130 ఓట్లకు పైగా మెజార్టీతో గెలుపు

వీ డ్రీమ్స్ అనకాపల్లి

అనకాపల్లి ప్రతిష్టాత్మక జార్జి క్లబ్ అధ్యక్షునిగా జగన్నాథ స్వామి దేవస్థానం చైర్మన్ దాడి బుజ్జి ఘన విజయం సాధించారు.

ఆదివారం ఉదయం స్థానిక జార్జి క్లబ్ ఆవరణలో నిర్వహించిన కార్యవర్గ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి ముగ్గురు సభ్యులు పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో దాడి బుజ్జి భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఆయనకు 130 ఓట్లకు పైగా మెజార్టీ లభించినట్లు క్లబ్ సభ్యులు తెలిపారు.

సౌమ్య స్వభావం, సభ్యులతో సత్సంబంధాలు, ప్రజాభిమానంతో పాటు క్లబ్ అభివృద్ధిపై ఉన్న నిబద్ధతే దాడి బుజ్జి విజయానికి కారణమని పలువురు సభ్యులు అభిప్రాయపడ్డారు.

జార్జి క్లబ్ అధ్యక్షునిగా ఎన్నికైన అనంతరం దాడి బుజ్జి మాట్లాడుతూ, “క్లబ్ అభివృద్ధికి కృషి చేస్తాను. సభ్యుల అభిప్రాయాలను గౌరవిస్తూ, అందరి సహకారంతో పారదర్శకంగా పనిచేస్తాను. జార్జి క్లబ్‌ను మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తాను” అని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *