వీ డ్రీమ్స్ న్యూస్

కన్నూరుపాలెంలో ఘనంగా “ఇంటింటికి కూటమి ప్రభుత్వం” విజయోత్సవ ప్రచారం

ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించిన కూటమి నేతలు

కశింకోట, ఆగస్టు 8:
అనకాపల్లి నియోజకవర్గం కశింకోట మండలం కన్నూరుపాలెం గ్రామంలో “ఇంటింటికి కూటమి ప్రభుత్వం” విజయోత్సవ ప్రచార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు, రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ సీఎం రమేష్, మాజీ మంత్రివర్యులు, అనకాపల్లి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ, మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్, APUFIDC చైర్మన్ పీలా గోవింద్ సత్యనారాయణ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమాలు, అమలు చేసిన పథకాలు, సాధించిన విజయాలను ప్రజలకు వివరించారు.

ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని, అభివృద్ధి ఫలాలు ప్రతి ఇంటికి చేరేలా కృషి చేస్తోందని నాయకులు పేర్కొన్నారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా మరిన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, హౌసింగ్ బోర్డ్ చైర్మన్ బత్తుల తాతయ్యబాబు, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్, గవర కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర, బీజేపీ జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, జిల్లా తెలుగు రైతు అధికార ప్రతినిధి ఉగ్గిన రమణమూర్తి, అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ డైరెక్టర్ ఉల్లింగల రమేష్, అనకాపల్లి ఏఎంసీ డైరెక్టర్ నైనంశెట్టి రమణారావు తదితరులు పాల్గొన్నారు.

కశింకోట మండల కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళా సోదరీమణులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *