వీ డ్రీమ్స్ రోలుగుంట
రోలుగుంట మండలం లోసింగి గ్రామాన్ని శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారి జి అప్పారావు నాయుడు, తహసిల్దారు నాగమ్మ, ఎంపీడీవో జీవీఎస్ ప్రసాదరావు లు స్థానిక బైబిల్ స్కూల్ ని సందర్శించారు ఎత్తైన కొండపైన ఉన్న ఈ స్కూలు పరిసరాలను డీఈవో తదితరులు పరిశీలించారు
ప్రభుత్వ పాఠశాల ఏర్పాటుకు కృషి చేస్తానని డీఈవో జి అప్పారావు హామీ ఇచ్చారు
ఈ మేరకు స్కూల్ ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారుచేసి ఉన్నత అధికారులకు పంపిస్తామన్నారు.
అలాగే అంగన్వాడి సెంటర్ ఏర్పాటుకు నివేదిక పెడతామని చెప్పారు. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం ఆర్ల పంచాయతీ కొండ శిఖర గ్రామమైన పెదగరువు. పాతలో సింగి. కొత్త లోసింగి.పివీటీజీ కొందు తెగ ఆదివాసి గిరిజనులు. 328 మంది జనాభా కలిగి ఉన్నారు. Y.B పట్నం గ్రామంలో ఎంపీపీ స్కూల్ లో మొత్తం విద్యార్థులు32 మందిలో లోసింగ. పాతలో సింగి గ్రామం నుండి 23 మంది విద్యార్థులు స్కూల్ కి వెళ్తున్నారు. వీరితోపాటు మరో 10 మంది ఒకటో తరగతి చదవడం కోసం కొత్తగా పాఠశాలలో చేరవలసి ఉందన్నారు. మొత్తంగా 33 మంది విద్యార్థులు. లోసింగి గ్రామాల్లో ఉన్నారని అధికారులు నిర్ధారించారు. అలాగే అంగన్వాడి సెంటర్ నిమిత్తం మూడు గ్రామాల నుండి 24 మంది చిన్నపిల్లలు ఉన్నారని నిర్ధారించారు. స్కూల్ కి వెళ్లాలంటే రాను పోను ఆరు కిలోమీటర్ల నుండి పది కిలోమీటర్ వరకు నడవాల్సి వస్తుంది. మా గ్రామంలో స్కూల్ ఏర్పాటు చేయాలని
జిల్లా అధికార బృందానికి మరియు మండల అభివృద్ధి అధికారి మండల రెవెన్యూ అధికారి గిరిజనులు వేడుకోవడం జరిగింది. కొన్ని సందర్భాల్లో స్కూల్‌కి వెళ్లలేక ఇంటి దగ్గరే ఉండిపోతున్నారు మా పిల్లలు. మా గ్రామంలో స్కూల్ పెడితే అందరూ చదువుకోడానికి వీలుపడుతుందని గ్రామస్తులు అధికారులను కోరారు.
అంగన్వాడి పిఓ మా గ్రామాన్ని సందర్శించినట్లుగా చేయాలని కోరారు. మా గ్రామాల్లో 30 మంది పిల్లలు ఉన్నారు. అంగన్వాడి ఫుడ్ తీసుకోవాలంటే రాజన్నపేట అంగన్వాడి సెంటర్ వెళ్లాలంటే అమ 15 కిలోమీటర్ల నడవవలసి వస్తుందన్నారు.. డిఆర్డిఏ అధికారులు మా గ్రామానికి రాకపోవడం చాలా అన్యాయమని అన్నారు .పీడీ స్థాయి అధికారులు మా గ్రామాన్ని సందర్శించి మా పిల్లలకి నాణ్యమైన బియ్యాన్ని అందించాలని వారు డిమాండ్ చేశారు. అంగన్వాడి సెంటర్ ఏర్పాటు చేయాలని తమరు ద్వారా జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ కి నివేదిక పంపించాలని కోరారు
. దీనితోపాటు ఎన్ ఆర్ జి ఎస్ నుండి రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. నెట్వర్క్ పూర్తి చేసి రోడ్ మెటల్ వేసి రోలింగ్ చేశారు. భారీ వర్షాలకు రోడ్లు కొట్టుకుపోవడంతో. మా గ్రామాలకి అంబులెన్స్ గాని ద్విచక్ర వాహనాలు వచ్చే అవకాశాలు లేవని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో ఎవరైనా అనారోగ్యానికి గురైతే వారిని డోలు మోతలే దిక్కు అని గ్రామస్తులు ఆవేదనను వెలిబుచ్చారు. బతుకుతున్నాము. వెంటనే రోడ్డు నిర్మాణ పనులను చేపట్టి మా గ్రామంలో స్కూల్ ఏర్పాటుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. అంగన్వాడి జిల్లా అధికారి మా గ్రామాల్లో సందర్శించి మా పిల్లలు భవిష్యత్తు ఆలోచించినట్లు చేయవలసిందిగా కోరారు .ఈ కార్యక్రమానికి సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కే గోవిందరావు. స్థానిక గిరిజన సంఘం నాయకులు కిలో నరసయ్య. వెంకట్రావు. కొండపాముల సత్తిబాబు. పంచాయతీ కార్యదర్శి రెవెన్యూ కార్యదర్శి తదితరులు అధికారులు పాల్గొన్నారు
