వీ డ్రీమ్స్ విశాఖపట్నం
ప్రశాంతతకు నిలయంగా ఉండే నగరంలో నేర కార్యకలాపాలు పిచ్చి మీరు పోతున్నాయి శనివారం నగరంలోని అక్కయ్యపాలెం లో నివాసం ఉంటున్న తిరుపతి వెంకటేశ పిలై నివాసంలో సుమారు 18 లక్షల రూపాయలు విలువచేసే 220 విదేశీ మద్యాన్ని ఎక్సైజ్ అధికారులు గుర్తించారు.వెంటనే ఈ మద్యాన్ని ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. ఇదివరలో వెంకటేశన్ పిళ్లై పై కేసు నమోదు అయిందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. గతంలో సుమారు 200 విదేశీ మద్యంతో దొరికినట్లు అధికారులు చెప్తున్నారు
విశాఖపట్నం ఎక్సైజ్ సూపరిండెంట్ ఆర్ ప్రసాద్ నేతృత్వంలో ఈ దాడులను నిర్వహించారు. తమిళనాడు కి చెందిన వెంకటేషన్ పిలై అక్కయ్యపాలెంలో సెటిల్ అయినట్లు అధికారులు గుర్తించారు విశాఖపట్నం ఎక్సైజ్ సూపరిండెంట్ ఆర్ ప్రసాద్ నేతృత్వంలో జరిగిన తనిఖీల్లో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్డెంట్ రాజశేఖర్, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ ఎం నాయుడు, హెడ్ కానిస్టేబుల్స్ రాజు, అప్పారావు, కానిస్టేబుల్స్ సతీష్, వెంకటేష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు
