రియల్ టైమ్ గవర్నెన్స్ అంటే ఇదా ??

వీ డ్రీమ్స్ నెట్ వర్క్

ప్రతీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీలు సమర్పించేందుకు ప్రజలు వ్యయ ప్రయాసలు కోర్చి అనకాపల్లి, విశాఖపట్నం కలెక్టరేట్లకు వెళ్ళ నవసరం లేదని ఆయా ప్రాంతాల్లోనితహసిల్దార్ కార్యాలయాలు,జిల్లా అధికార్ల కార్యాలయలలో లేదా సచివాలయాల ద్వారా లేదా వ్యక్తిగతంగా ఆన్లైన్ ద్వారా , అర్జీలు సమర్పించుకోవచ్చని అనకాపల్లి జిల్లా కలెక్టర్ పదేపదే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు ఆదివారం కూడా ఇలాంటిదే మరొక ప్రకటన విడుదల చేశారు అయితే అనకాపల్లి జిల్లాలోని లేదా విశాఖ జిల్లాలోని ప్రజలు తమ అర్జీలను సమర్పించేందుకు తహసిల్దార్ కార్యాలయాలు కానీ సచివాలయాలకు కానీ వెళ్ళేందుకు ఇష్టపడడం లేదు వ్యయ ప్రయాసలకు ఓర్చి జిల్లా కలెక్టర్ కార్యాలయాలకు వె డుతున్నారు.

అలా ఎందుకు చేస్తున్నారు?

అనకాపల్లి జిల్లా కలెక్టర్ చెప్పిన సదవకాశాన్ని ప్రజలు ఎందుకు ఉపయోగించుకోవడం లేదు.?
అంటే అందుకు వారికి తగిన కారణాలు ఉన్నాయి.
కలెక్టరేట్లో సమర్పించిన అర్జీలకు ప్రత్యేకంగా ఒక ఐడీ నెంబర్ ఇస్తారు .ఆ నెంబర్ ద్వారా ఆ దరఖాస్తు లేదా అర్జీ స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వీలుంటుంది . టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఒకటి సున్నా సున్నా ను ఉపయోగించి తమ అర్జీ పరిస్థితిని తెలుసుకోవచ్చు. అర్జీల పరిష్కారం ఎంతవరకు వచ్చింది అనే విషయాన్ని తెలుసుకునేందుకు సంబంధిత అధికారులకు కలెక్టర్ వర్తమానాలు పంపుతుంటారు. అధికారులు కూడా అర్జీల పరిష్కారం పై కలెక్టర్కు నివేదికలు సమర్పిస్తూ ఉంటారు. ప్రతి పని నిర్ణీత కాలంలో పరిష్కారం కావాలి. లేదా పరిష్కారం కాకపోవడానికి గల కారణాలను అర్జీదారులకు తెలియపరచవలసి ఉంటుంది. ఈ పని జరుగుతోందా? లేదా తెలుసుకునేందుకు కలెక్టర్ కార్యాలయం ప్రయత్నిస్తూ ఉంటుంది దీంతో అధికారులు అప్రమత్తంగా ఉండి తమ సమస్యలను పరిష్కరిస్తారని ప్రజలకి నమ్మకం ఉంది. అందువల్లనే ప్రజలు పెద్ద సంఖ్యలో కలెక్టర్ కార్యాలయానికి తరలి వెళ్లి అర్జీలను సమర్పిస్తున్నారు. అయితే వారం వారం పెద్ద సంఖ్యలో వచ్చే ఈ అర్జీలను సంబంధిత కార్యాలయాలకు పంపడం వాటిని ఫాలోఅప్ చేయడం కలెక్టర్ కార్యాలయంకు తలక మించిన భారమవుతోంది దాంతో అర్జీల పరిస్థితి తీసికట్టుగా తయారవుతోంది ఇదేమైనా ప్రజలు కలెక్టర్ కార్యాలయాన్ని విశ్వసిస్తూన్నట్లుగా మిగతా కార్యాలయాలను విశ్వసించడం లేదు. తాసిల్దార్ కార్యాలయాలు ఇతర కార్యాలయాల్లో అర్జీలు సమర్పించిన వెంటనే ఉద్యోగులు లంచాల కోసం చేతులు చాపుతూ ఇబ్బంది పెడతారు .లంచాలు ఇచ్చుకోకపోతే కాళ్లు అరిగేలా తిప్పుతారు. దీనిపై ఫిర్యాదు చేసినా అతీగతీ ఉండదు . వీఆర్వో లేదా రెవెన్యూఇన్స్పెక్టర్ తమ పనులు చేయడం లేదని తాసిల్దార్ కు మొరపెట్టుకుంటే తాసిల్దార్లు చర్యలు తీసుకోవడం లేదు. మామూలులో వారికి బాగం ఉంటుంది కనుకనే వారు తమ గోడు పట్టించుకోవడంలేదని ప్రజలు విమర్శిస్తున్నారు

తాసిల్దార్ కార్యాలయంలో అర్జీలు సమర్పించుకుంటే దానికో అర్జీ నెంబరు లేదా ఐడి నెంబర్ కూడా ఇవ్వరు దానిని సరిగా నమోదు చేయరు . టపాలు లో ఒక కాపీ ఇచ్చి పొమ్మంటారు ఆ కాపీ ఎక్కడకు చేరుతుందో ఎవరికి తెలియదు. నెలల తరబడి తిప్పుతారే తప్ప ఆ అర్జీ ఏమైందో తిరిగి చెప్పే పరిస్థితి కార్యాలయాలలో ఉండడం లేదు. కార్యాలయాలకు వెళ్లే అర్జీదారులకు అక్కడ కనీస సదుపాయాలు కూడా ఉండడం లేదు .చాలా తాసిల్దార్ కార్యాలయంలో మంచినీటి సదుపాయం కూడా ఉండడం లేదు. బయట గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుంది. తాసిల్దారులతో అదే సమయంలో స్థానిక చోటామోటా రాజకీయ నాయకులు సంభాషణకు దిగితే గంటలు తరబడి సమయం తీసుకుంటారు. తమను లోపలకు పంపమని అనేకసార్లు అర్జీ దారులు గేటు వద్ద ఉండే వారితో గొడవలు పడుతున్న విషయం తెలిసిందే

సచివాలయాల తీరు ఇలా ఉంది!!
ఇక సచివాలయంలో అర్జీలు సమర్పణ విషయానికి వస్తే, అక్కడ అర్జీలను నమోదు చేసుకునేందుకు సరైన అవకాశం ఉండడం లేదు. చాలా సచివాలయాల్లో సిబ్బందికి ఆన్లైన్ అర్జీల నమోదు పై అవగాహన లేదు. లేదా లేనిపోని తలనొప్పి ఎందుకని వచ్చిన అర్జీ దారులను కలెక్టరేట్ కు వెళ్ళమని సలహాలు ఇస్తూ ఉంటారు.
అర్జీలను స్కాన్ చేసి సమర్పించే అవకాశం సచివాలయాల ఆన్లైన్లో లేకపోవడం పెద్ద లోపం. అక్కడ అర్జీ తీసుకొని ఆధార్, మొబైల్ నెంబరు తీసుకొని దాన్ని ఒక ప్రొఫార్మాలో నమోదు చేస్తారు .అక్కడితో సరి.సంబదిత కార్యాలయాల నుంచి అర్జీదారులకు ఫోన్ వస్తుందని వారు తమ గోడు వివరించుకోవచ్చని చెప్తున్నారు కానీ వారాలు నెలలు తరబడి అర్జీలు సమర్పించుకున్న వారికి సంబంధిత కార్యాలయం నుంచి ఏ ఒక్కరు ఫోన్ చేయడం లేదనే విషయం గమనార్హం. ఆర్డిఓ కార్యాలయాలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. భూముల రీ సర్వేలో తమకు 92 నోటీస్లు ఇవ్వలే దనే విషయాన్ని ఒకరు అనకాపల్లిలోని ఒక సచివాలయం ద్వారా మొరపెట్టుకుంటే ఆర్డీవో కార్యాలయం నుంచి మీకు ఫోన్ వస్తుంది అక్కడ చెప్పుకోండి అని చెప్పారు అలాంటి ఫోన్ ఏది రాకపోవడంతో సంబంధిత అర్జీదారుడు ఆర్డిఓ కార్యాలయానికి స్వయంగా వెళ్లి అర్జీని అక్కడ సిబ్బందికి ఇచ్చారు . స్కాన్ చేసుకుని రెండు రోజుల్లో మీకు ఫోన్ వస్తుందని చెప్పారు కానీ వారాలు గడుస్తున్న అతిగతి లేదు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక తీరు ఇలా ఉంది.
రియల్ టైం గవర్నెన్స్ అంటే ఇదేనా

ప్రభుత్వాధినేతలు తరచు రియల్ టైం గవర్నెన్స్ గురించి ఉపన్యాసాలు ఇస్తుంటారు కానీ వాస్తవానికి వచ్చేసరికి రియల్ టైం కాదు కదా ఏ టైం లోను సమస్యలు పరిష్కారం కావడం లేదు. అర్జీలు గడువులోగా ఎందుకు పరిష్కారం కావడం లేదు అనే విషయంపై సంబంధిత అధికారులను ప్రశ్నించేందుకు, ఫైళ్లను ట్రాక్ చేసేందుకు జిల్లా అధికారులకు అవకాశం ఉంది కానీ వారు దీనిని ఎట్టి పరిస్థితులోను ఉపయోగించుకోరు. ఇటీవల వివిధ పత్రికల్లో పిజిఆర్ఎస్ ఒక మొక్కుబడిగా, తూతు మంత్రం గా నడుస్తోందని విమర్శలు రావడంతో కొందరు వీఆర్వోలకు అర్జీలు నంబర్లను ఇచ్చి అర్జీదారులకు ఫోన్లు చేయమన్నారు. వారు సమాచారం అడిగినట్టుగా వాకబు చేసి అడిగి కథ ముగించేశారు.
రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల్లో చెడ్డ పేరు తెచ్చే రెవెన్యూ శాఖ తర్వాత ప్రజా సమస్యల పరిష్కార వేదిక ( పి జి ఆర్ ఎస్) ఉంటోంది. ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి ,సంబంధించిన శాఖల మంత్రులు సిసిఎల్ఏ వంటి ఉన్నతాధికారులు పిజిఆర్ఎస్ పై ప్రత్యేక దృష్టి పెట్టకపోతే ప్రభుత్వంకు చెడ్డ పేరు ఖాయం. ప్రజలు సమస్యలు పరిష్కారం కాక తీవ్ర ఇబ్బందులకు గురవుతారు.

గణాంకాలు నిజమేనా?
పిజిఆర్ఎస్లో ఈనెల 15 వరకు 10 లక్షల ఇరవై తొమ్మిది వేల 42 గ్రీవెన్స్ రిజిస్టర్ అయ్యాయని వాటిలో 9,64883 గ్రీవెన్స్ పరిష్కారం అయ్యాయని మీకోసం వెబ్సైట్లో చూపిస్తున్నారు ఇంకా 64 వేల 519 గ్రీవెన్స్ మాత్రమే పెండింగ్లో ఉన్నాయని చెప్తున్నారు. అర్జీలు సమర్పించుకొని కాళ్ళు అరిగేలా తిరుగుతున్న ప్రజలు మాత్రం ఈ గణాంకాలను నమ్మడం లేదు. సెంట్రలైజ్డ్ పబ్లిక్ గివెన్స్ రెడ్ డ్రెస్ అండ్ మోనిటరింగ్ సిస్టం ను పర్యవేక్షించే మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ పీజిఆర్ఎస్ (ప్రజా సమస్యల పరిష్కార వేదిక) పై ప్రత్యేక దృష్టి పెట్టి వ్యవస్థను చక్క దిద్దాల్సి ఉంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *