( వీడ్రీమ్స్ ప్రత్యేకం)
మూడు నెలల్లో ప్రజల నుంచి వచ్చిన రెవెన్యూ పిర్యాదు లను పరిష్కరించాలని ఈ ఏడాది మార్చి 20న రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జెసిలను ఆర్డిఓ లను ఆదేశించారు. సమస్యలు పరిష్కారం కాలేదని ఫిర్యాదులు వస్తే రెవెన్యూ అధికారులే బాధ్యత వహించాలని ఆయన హెచ్చరించారు. రీ సర్వే, భూముల సమస్యలపై రైతులు ఇచ్చిన ఫిర్యాదులను క్షేత్రస్థాయికి వెళ్లి విచారించి పరిష్కరించాలని ఆదేశించారు . ఫిర్యాదులను ఆషామాషీగా తీసుకొని ఏదో పరిష్కరించామని కేసులు క్లోజ్ చేస్తే కుదరదని ,అలా ఎవరైనా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అదనపు ప్రధాన కార్యదర్శి, భూపాలన అధికారి ఇచ్చిన ఈ మూడు నెలల హామీ అనకాపల్లి జిల్లా లో ఎలా అమలు జరిగిందో ఇక్కడి ప్రజలకు తెలుసు
చాలా జిల్లాల్లో జెసిలు ఆర్డీవోలు ఈ సూచనలను పాటిస్తున్నారు . కొందరు జేసీలు ఆర్డీవోలు ఈ అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టి సమస్యలను బాగా పరిష్కరిస్తున్నారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గుంటూరు కృష్ణ జిల్లాల జేసీలను ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
కొన్ని జిల్లాల్లో నోషనల్ ఖాతాల ను మామూలు ఖాతాలుగా మార్చేందుకు ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహిస్తున్నారు. అనకాపల్లి జిల్లాలో రెవెన్యూ అధికారులు ఇలాంటి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టకపోగా. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీలు ఇచ్చిన వారిని సైతం ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు. తాసిల్దార్లు అర్జీలను పరిష్కరించకుండానే పరిష్కరించామని పేర్కొంటూ క్లోజ్ చేస్తున్నారు. దీంతో అర్జీదారులు అనేకసార్లు కలెక్టరేట్‌కు అర్జీలు సమర్పించుకోవలసి వస్తోంది.
అర్జీలు పరిష్కారం పై జేసీ ఆర్డీవోలు తాసిల్దారులతో సమీక్ష లు నిర్వహించకపోవడం వలన తాసిల్దారులు సమస్యలు పరిష్కారంలో మొండివైఖరి అవలంబిస్తున్నారు. కాసులు కుమ్మరించిన వారికి పనులు జరుగుతున్నాయి. లంచాలు ఇస్తే అక్రమాలు సైతం చేయడానికి వెనుకాడరు. విస్సన్నపేట, కోడూరు నంగినారపాడు సబ్బవరం ప్రాంతాల్లో జరిగిన భూ కుంభకోణాలు ల్యాండ్ పూ లింగ్ అధికార పార్టీ నాయకులు ,రెవెన్యూ అధికారుల కుమ్మకు కు నిదర్శనం. సబ్బవరం చుట్టుపక్కల ప్రభుత్వ భూముల దురాక్రమణల పర్వం పట్ల అక్కడి రెవెన్యూ యంత్రాంగం మౌనం దాల్చి నా వారి పై జిల్లా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు.
జగన్ హయాంలో జరిగిన రీ సర్వే అక్రమాలను పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రెవిన్యూ మంత్రి పదే పదేప్రజలకు హామీలు ఇచ్చారు.. రీ సర్వే రెవిన్యూ సదస్సుల లో వచ్చిన అర్జీలను పరిష్కరించకుండానే పరిష్కరించినట్లు చూపుతున్నారు. ఎమ్మెల్యేలు ఇలాంటి ప్రజల సమస్యల జోలికి పోవడం లేదు. రాజకీయ పక్షాల సదస్సుల్లో అసలు ప్రజా సమస్యలే లేనట్లు నాయకులు ప్రవర్తిస్తుంటారు
గ్రామ రెవెన్యూ కోర్టుల మాటే లేదు
రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో గ్రామ రెవెన్యూ కోర్టులు నిర్వహిస్తామని అదనపు సీసీఎల్ఏ ,సర్వే డైరెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి మార్చ్ నెలలో ప్రకటించారు.అందుకోసం ఏర్పాట్లు చేసుకోవాలని జేసీలుకు సూచించారు గ్రామ రెవెన్యూ కోర్టుకు తాసిల్దార్ ఆర్డీవో ఇతర అధికారులు హాజర వ్వాలని చెప్పారు. ప్రజలు రెవిన్యూ సమస్యలు పరిష్కారం చూపే దిశగా ఈ విధానం ఉంటుందని ప్రకటించారు. అయితే జాయింట్ కలెక్టర్లు ఈ విషయాన్ని పట్టించుకున్నట్లు లేదు ఈ దిశగా ప్రయత్నాలు జరగడం లేదు.
నివేదిక సమర్పిస్తాం
జిల్లా లో జరుగుతున్న ఈ రెవెన్యూ భాగోతం పై మంత్రి లోకేష్ కు, రెవెన్యూ మంత్రికి
నివేదిక సమర్పిస్తామని తెలుగుదేశం జిల్లా నాయకుడు ఒకరు వీ డ్రీమ్స్ కు తెలిపారు
