అర్జీలను క్షేత్రస్థాయిలో పరిష్కరించండి

వీ డ్రీమ్స్ అనకాపల్లి

ప్రజా పిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పి.జి.అర్.ఎస్.) లో వచ్చిన అర్జీలను అధికారులు వ్యక్తిగతంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అర్జీలను పరిష్కరించాల జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్ జేసీ ఎం జాహ్నవి జిల్లా మండల స్థాయి అధికారులను ఆదేశించారు. ప్రజల నుండి తీసుకున్న అర్జీల గురించి వెంటనే సంబంధిత అదికారులను వివరాలు అడిగి తెలుసుకొని, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్అర్జీల ఫై సమీక్ష నిర్వహిస్తూ ప్రజల నుండి వచ్చిన అర్జీలను నిర్ణిత సమయంలో పరిష్కరించా లన్నారు. ప్రజలు అందజేసిన ధరఖాస్తుల పరిష్కారానికి అర్జీదారులతో నేరుగా మాట్లాడాలన్నారు. పరిష్కరించిన వినతులను ధరఖాస్తుదారునికి తెలియజేయాలని, పరిష్కారం కాని అర్జీల గూర్చి వారికి అందుకుగల కారణాలు వివరంగా తెలియజేయడం ద్వారా అర్జీలు రీ ఓపెన్ కాకుండా నివారించవచ్చని తెలిపారు. పి జి ఆర్ ఎస్ అర్జీలు జిల్లా అధికారి లాగిన్ లో ఉంటే జిల్లా అధికారి మండల అధికారి లాగిన్ లో ఉంటే మండల అధికారి నేరుగా క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్లి, ప్రజల సమస్యలను క్షేత్ర స్థాయిలోనే పరిష్కరించాలని అధికారుల కు సూచించారు. ప్రతి శాఖ అధికారి వారి శాఖకు సంబంధించిన అర్జీల పరిష్కార పరిస్థితిని ప్రతిరోజు పర్యవేక్షణ చేసి నిర్ణిత సమయంలో చర్యలు తీసుకోవాలన్నారు, అర్జీదారులు తమ అర్జీల సమాచారం కోసం 1100 కాల్ చేసి తెలుసుకోవచ్చని కలెక్టర్ అర్జీదారులకుసూచిం చారు.
అర్జీలు పరిష్కారంలో అధికారులు ముఖ్యంగా రెవెన్యూ అధికారులు అల సత్వం వహిస్తున్నారు అన్న విమర్శలు ప్రజల నుంచి, ప్రజా ప్రతినిధులనుంచి రావడంతో ప్రభుత్వం పిజిఆర్ఎస్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *