వీ డ్రీమ్స్ వీ మాడుగుల
గిరిజన మహిళలు సుస్థిర అభివృద్ధి రంగంలో కీలక పాత్ర పోషించాలని మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి అన్నారు. వి మాడుగుల మండలం కామకుంటం లోవ కోటపల్లి గిరిజన గ్రామాల్లో కేంద్ర శాస్త్ర,సాంకేతిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న శిక్షణా కేంద్రం కు ఆయన శంకుస్థాపన చేసారు. ‘ ఒక కుటుంబం – ఒక వ్యవస్థాపకుడు’ అనే కార్యక్రమంలో భాగంగా గిరిజన మహిళల్లో వ్యవస్థాపనా సామర్థ్యాలు పెరిగేందుకు ఇది సాయపడుతుందని అన్నారు. అరటి నార వ్యర్థాలను ఉపయోగంలోకి తేవడం ద్రవరూప జీవ ఎరువులు తయారీలో కేంద్రం సహయ పడుతుందని బండారు అన్నారు.ప్రాజెక్టు కో – ఆర్డినేటర్ గీతం యూనివర్సిటీ ప్రధాన పరిశోధకులు డాక్టర్ సౌమ్య,డి.ఎస్.టి విత్తన విభాగం నిపుణులు డాక్టర్ గోపీకృష్ణ ఆరోహణ్ సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.