వీ డ్రీమ్స్ పరవాడ
పరవాడ ఫార్మాసిటీ లోని రక్షిత్ డ్రగ్స్ ఫార్మాలో వాయువులు లీకేజీ తో ఇద్దరు కార్మికులు అస్వస్థత గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై విచారణ జరిపి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సిఐటియు అనకాపల్లి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తున్నది. ఇటీవల కాలంలో ఠాగూర్ లాబరేటరీ లో ఫార్మ వాయువులు లీకేజీ తో పదుల సంఖ్యలో కార్మికులు ఇదే విధంగా స్వస్థత గురయ్యారని, నేడు మళ్ళీ రక్షిత్ ఫార్మాలో ఇటువంటి ఘటన జరగడం ఆందోళన కలిగిస్తుందని సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆర్ శంకర్రావు జి కోటేశ్వరరావు అన్నారు. ఫార్మా లో తరచూ ప్రమాదాలపై ప్రభుత్వం గానీ యాజమాన్యాలు గానీ తమ బాధ్యతరాహిత్యం వెల్లడిస్తున్నాయన్నారు. రక్షిత్ డ్రగ్స్ ఫార్మా లో జరిగిన ప్రమాదంపై విచారణ చేయాలని, భద్రతా ప్రమాణాలపై ఆడిట్ నిర్వహించాలని డిమాండ్ చేస్తుందన్నారు.