(వీ డ్రీమ్స్ ప్రత్యేకం)
రెవెన్యూ సమస్యలను పరిష్కరించి రైతులకు మేలు చెయ్యాలన్న మంచి సంకల్పం తో ప్రారంబించిన రెవెన్యూ సదస్సులు నీరు గారి పోతున్నాయి. తహసీల్దారు లు రెవెన్యూ ఉద్యోగులు వీటిని నామ మాత్రంగా నిర్వహిస్తున్నారనే విమర్శలు వెలువెత్తుతున్నాయి.జిల్లా కలెక్టర్లు, భూ సమస్యలను పరిష్కరించ వలసిన జాయింట్ కలెక్టర్లు ఉదాసీనంగా ఉన్నందునే ఈ పరిస్థితి నెలకొందని రైతు సంఘాలు ద్వజమెత్తు తున్నాయి. జాయింట్ కలెక్టర్లు కొన్ని సదస్సులకైనా హజరై వాటి లక్ష్య సాధనకు కృషి చేస్తేఅవి ఆదర్శంగా నిలిచేవి.
ఒక్క పూటలో ఏ సమస్య పరిష్కారం కాదనే రీతిలో తహసీల్దారు లు,రెవెన్యూ ఉద్యోగులు సదస్సులను కాలక్షేపం మీటింగ్ లు గానే నిర్వహిస్తున్నారనిఆరోపణలు వస్తున్నాయి. రెవెన్యూ సదస్సులను పకడ్బందీగా నిర్వహించేందుకు మార్గదర్శకాలను ప్రభుత్వం సూచించింది. ఈ సదస్సులు ప్రభుత్వ ప్రతిష్ట ను పెంచేవిగా ఉండాలని ముఖ్యమంత్రి మరీ మరి కోరారు. సదస్సు కు ముందే రెవెన్యూ సిబ్బంది గ్రామాల్లో పర్యటించి పరిష్కారం అయ్యే సమస్యలను గుర్తించి వాటిని సదస్సులో తహసీల్దారు లు పరిష్కరించేలా చూడాలని ఆదేశించారు. అయితే సదస్సులు జరిగిన వారం రోజుల్లో ఇలా పరిష్కారం అయిన వాటి సంఖ్య ను వెళ్ళమీదనే లెక్కించవచ్చు
భూ పాలనాధికారి
ఆదేశాలు బేఖాతర్
రీ సర్వే పూర్తి అయిన గ్రామాల్లో సర్వే లోపాల పై పిర్యాదు చేసేందుకు ఫైనల్ ఆర్ఒఆర్ లు,ఎల్.పి.ఎం లు అందుబాటులోఉండటం లేదు. సర్వే పూర్తయిన కొన్ని గ్రామాల ఫైనల్ ROR లు జెసి లాగిన్ లో ఆమోదానికి నోచుకోక 6 నెలలుగా పెండింగ్ లో ఉండిపోయాయి.
సర్వే లోపాలను సరిదిద్దే అవకాశం ఒక్క జెసి లాగిన్ ద్వారా నే వీలవుతుంది. సాప్ట్ వేర్ ను రెఢీ చేయకపోవడం ప్రధాన సమస్య.విలేజ్ మ్యాప్ లే కాక ఎప్.ఎంబి లు మీ భూమి యాప్ లో గాని,సచివాలయాల్లో కాని లభ్యం కావడం లేదు.ఎఫ్ లైన్ పిటిషన్ లు పెద్ద సంఖ్యలో సదస్సు ల్లోనమోదు అవుతున్నాయి. 22a, ముటేషన్ వంటి వాటి కి సదస్సులో దరఖాస్తు చేస్తే ఫీజులు కూడాచెల్లించవలసిన అవసరం లేదన్నారు. దీనిపై స్పష్టత లేదు. 22ఎ అక్రమ నమోదులపై కలెక్టర్లు కు గతం లో అందిన పిర్యాదు లను సదస్సుల లో పరిష్కరించ మన్న ఆదేశం అమలు కావడం లేదు.
సదస్సుల కు 22a జాబితాను తీసుకుని వెళ్లడమే తప్ప పని సున్న. పరిష్కరించేందుకు అవసరమైన రికార్డు అందుబాటులో లేదనిఅధికారులు చెబుతున్నారు. తహసీల్దార్ లు శ్రద్ధ తీసుకుంటే వీటిని పరిష్కరించవచ్చు. జెసి లుసదస్సులకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదని రెవెన్యూ సమస్యల పరిష్కారం ను పట్టించకొడం లేదని ఒక తెలుగు దేశం నాయకుడు విమర్శించారు. వైసీ పి నాయకులు ఇచ్చేధర్నా మెమొరాండం స్వీకరించడానికి ఉన్న శ్రద్ధ సదస్సు పై లేదని ఆరోపించారు