( వీ డ్రీమ్స్ విలేకరి- అనకాపల్లి కలెక్టరేట్)
కూటమి ప్రభుత్వం రెవెన్యూ సమస్యలను పరిష్కరించేందుకు దీక్ష బూనిందని ముఖ్యమంత్రి, మంత్రులు పదేపదే చెప్తున్నారు.కలెక్టర్లు ప్రతి సోమవారం రెవెన్యూ సమస్యలే కాదు అన్ని సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికార యంత్రాంగానికి నూరిపోస్తుంటారు.మీడియా చేతులు నొప్పి వచ్చేలా,గొంతు బొంగురు పోయేలా దీనంతటిని ప్రచారం చేస్తూనే ఉంది.
మొన్న బుచ్చెయ్యపేట మండలం రైతులు రెవెన్యూ సదస్సులు అన్ని డొల్ల అంటూ గొడవ చేసారు. వారు రెవెన్యూ తతంగాన్ని పసిగట్టే సారు!!!
తప్పుల సవరణకు ఆ మధ్య సర్వే జరిగిన గ్రామాల్లో సదస్సులు నిర్వహించారు.అవి ముగిసి ముగియగానే పదిహేను రోజుల్లో సవరణల ప్రక్రియ పూర్తి చేస్తామని తహసీల్దారు లు హమి ఇచ్చారు. వేలాదిగా అందిన అర్జీ లను కార్యాలయం లో కుప్ప వేసారు. పధకాల మీద పధకాలు సదస్సులు మీద సదస్సులు ప్రారంబించే ప్రభుత్వం ఇంతలో అన్ని గ్రామాల్లోను రెవెన్యూ సదస్సులు జరపాలని వీటి పరిష్కారానికి గ్యారంటీ కూడా ఇచ్చింది. ఇంకే ముంది రోజుకు రెండు గ్రామాలు చొప్పున అన్ని రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు ప్రారంభమయ్యాయి. అర్జీలు పోగు పడుతున్నాయి రీ సర్వేల అర్జీల గతి ఏమైందో ఎవరూ చెప్పడం లేదు.
జిల్లా కలెక్టర్లు ప్రతి సోమవారం నిర్వహంచే గ్రీవైన్స్ డే అర్జీల పరిష్కారం కాకుండానే పరిష్కారం అయినట్లు నివేదికల్లో చూపిస్తారు. భాదితులు చెప్పులు అరిగేలా కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉంటారు.
సదస్సుల అర్జీల గతి కూడా అంతే అని బుచ్చెయ్యపేట మండల రైతులు రుసరుస లాడారు
ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కలెక్టర్ కార్యాలయంలో పోగు పడిపోయిన గ్రీవియన్స్ అర్జీ లను నెల రోజుల్లో పరిష్కరించాలి అది మాని ప్రచార యావ తో రైతులను వెర్రివెంగళప్పలను చేస్తున్నారని వారు ధ్వజమెత్తుతున్నారు