వీ డ్రీమ్స్ అనకాపల్లి
అనకాపల్లి పట్టణం ఇటీవలే గాంధీనగర్ కు చెందిన డాన్స్ ఈవెంట్ ఆర్గనైజర్ ఫరీద్ యాక్సిడెంట్ కు గురై కొన్ని నెలలుగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ, పిల్లలు చదువుకు కూడా ఇబ్బందులు ఉన్నాయని తెలిసి మల్ల రాం బుజ్జి గారి ద్వారా ప్రముఖ సంఘ సేవకులు గోల్డ్ వాసు ముందుకు వచ్చి వారి కుటుంబాన్ని కావలసిన మూడు నెలలపాటు సరుకులు, బియ్యం బస్తాలు, పిల్లలు పుస్తకాలకు 5000/ నగదు తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ మల్ల సురేంద్ర చేతుల మీదుగా ఫరీద్ కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా మల్ల సురేంద్ర మాట్లాడుతూ కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునే గుణం ఉన్న మంచి మనిషి గోల్డ్ వాసు అని , అభినందించారు. ఈ కార్యక్రమంలో గోల్డ్ వాసు, పోలమర్శెట్టి చందు, తదితరులు పాల్గొన్నారు.
