వీ డ్రీమ్స్ మునగాక
మునగపాక మండలం తోటాడ గ్రామంలో నిన్న రాత్రి వైన్ షాపు చోరీకి గురైంది. తోటాడ సెంటర్లో ఉన్న వైన్ షాప్ లో నిన్న గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. వైన్ షాపు బయట ఉన్న సీసీ కెమెరాలు బద్దలు కొట్టి షాపు తాళాలను విరగగొట్టి లోపలకు వెళ్లినట్లుగా స్థానికులు గుర్తించారు. ఈ మేరకు తెల్లవారుజామున స్థానికులు వైన్ షాపు యజమానికి సమాచారం అందించారు. దీంతో వైన్ షాప్ యజమాని మునగపాక మండల పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే లోపల 15 వేల రూపాయలు నగదు ఉన్నదని ఇంకా మద్యం ఉన్నదని షాపు యజమాని చెప్తున్నాడు. ఈ మేరకు మునగపాక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోవలసి ఉంటుంది. తోటాడ జంక్షన్ లో ఏర్పాటు చేసిన పనిచేసే ఉంటే ఆ కెమెరా ద్వారా నిందితులను తెలుసుకునే అవకాశం ఉంటుంది.


