వీ డ్రీమ్స్ పలాస
ఆంధ్రప్రదేశ్లో యువతకు జరుగుతున్న అన్యాయాలను నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన రిలే నిరాహార దీక్షల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లా పలాసలో దీక్షలు ప్రారంభమయ్యాయి.
వైఎస్సార్సీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు, మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ఆదేశాలతో పలాస వైఎస్సార్సీపీ నాయకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు పలు డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు.
డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని, దీనికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలోని విద్యార్థులకు ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు.
ఎన్నికల సమయంలో కూటమి నాయకులు నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాలు కల్పించే వరకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి అందించాలని డిమాండ్ చేశారు.
పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గోపీ శిష్టు ఆధ్వర్యంలో జరిగిన ఈ రిలే నిరాహార దీక్షలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

