ప్రపంచ తల్లిపాల వారోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్

వీ డ్రీమ్స్ అనకాపల్లి

ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా అనకాపల్లి జిల్లాలో ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పోస్టర్లను జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, శిశువు పుట్టిన వెంటనే తల్లిపాలను ప్రారంభించడం, తొలి ఆరు నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వడం, అనంతరం శిశువుకు అవసరమైన పోషకాహారంతో పాటు తల్లిపాలను కొనసాగించడం వల్ల ఆరోగ్యకరమైన ఎదుగుదల, సంపూర్ణ అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు.

తల్లిపాల ప్రాముఖ్యతపై జిల్లాలోని ప్రతి తల్లి, కుటుంబానికి అవగాహన కల్పించేందుకు ఆరోగ్య సిబ్బంది, అంగన్‌వాడీ సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు.

ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను జిల్లాలో విజయవంతంగా నిర్వహించి, శిశు ఆరోగ్య పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ అచ్చుతకుమారి, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ చంద్రశేఖర్ దేవ్, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ సూర్యలక్ష్మి, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్, సీడీపీఓలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *