ఆదిదేవుళ్ల సన్నిధిలో 8వ ఉంజల్ సేవకు ఏర్పాట్లు

ముఖ్య అతిథిగా హాజరుకానున్న పీలా గోవింద సత్యనారాయణ

వీ డ్రీమ్స్ అనకాపల్లి

అనకాపల్లి పట్టణానికి ఈశాన్య దిశలో వెలసిన శ్రీ రమా సమేత శ్రీ సత్యనారాయణ స్వామి, శ్రీ ఉషా చాయ పద్మిని సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో 8వ ఉంజల్ సేవ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నారు.

తిమ్మాపాత్రుని చక్రవర్తి ఆధ్వర్యంలో అన్నమయ్య వాగ్గేయ వరదాయని బృందం ద్వారా ఈ నెల 8వ తేదీ శనివారం సాయంత్రం 6 గంటలకు శ్రీ రమా సమేత శ్రీ సత్యనారాయణ స్వామివారి 8వ ఉంజల్ సేవ కార్యక్రమం జరగనుంది.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, అనకాపల్లి టీడీపీ ఇన్‌చార్జి శ్రీ పీలా గోవింద సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అనంతరం ఆయన చేతుల మీదుగా “అమ్మ మాయమ్మ మా తల్లి రమాదేవి” భక్తి గీతం ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తలు భక్తజనావళికి ఆహ్వానం పలుకుతూ, అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమానికి దేవస్థానం చైర్మన్ బొడ్డేడ మురళి, ధర్మకర్తలు సూరిశెట్టి బల్లమ్మ, దొడ్డి భరత్, కర్రీ లక్ష్మీ నూకరాజు, మారిశెట్టి అరుణ భాస్కరరావు, తురకలపూడి ఈశ్వరరావు, తమ్మిరాజు మల్లికార్జునరావు, రేబాక వరలక్ష్మి ఈశ్వరరావు, కైచర్ల నరసమ్మ తదితరులు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.

దేవస్థానం కార్యనిర్వహణ అధికారి బి. మురళీకృష్ణ, ప్రధాన అర్చకులు మావుడూరి విద్యాసాగర్ కార్యక్రమ ఏర్పాట్లలో పాల్గొంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *