(వీడ్రీమ్స్ విలేకరి )
ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందజేసిన మీ అర్జీ స్టేటస్ ను చూడలేకపోతున్నా రా. అవును మీరు చూడలేరు. మీకోసం పోర్టల్ అలా ఉంది మరి.
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీ అందజేసిన తర్వాత కొన్నాళ్ళుకు అర్జీ స్టేటస్ ఎలా ఉందో తెలుసుకునేందుకు మీకోసం పోర్టల్ ఓపెన్ చేసి స్టేటస్ చెక్ చేస్తాము. అక్కడ మనం మన సమస్య ఐడి నెంబర్ను ఎంటర్ చేసిన తర్వాత ఒక క్యాప్చ ఎంటర్ చేయవలసి ఉంటుంది కానీ ఆ క్యాప్చ కి గెట్ డీటెయిల్స్ అనే సూచన అడ్డుపడుతూ ఉంటుంది.
దీంతో ఎవరు ఆ క్యాప్చర్ ఎంటర్ చేయలేకపోతున్నారు స్టేటస్ వివరాలు తెలుసుకోలేకపోతున్నారు ఇది మన సమస్యల పరిష్కార వేదిక పనితీరు.
స్టేటస్ తెలుసుకునేందుకు మరో మార్గం లేకపోలేదు ప్రస్తుతానికి అది బాగానే పనిచేస్తుంది ఒకటి ఒకటి సున్నా సున్నా అనే నెంబర్ డయల్ చేసి స్టేటస్ వివరాలను తెలుసుకోవచ్చు
