(వీ డ్రీమ్స్ అనకాపల్లి)
అనకాపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్ గా మల్లవరపు సూర్య తేజ నియమితులయ్యారు. సమర్థుడైన అధికారిగా ఆయనకు మంచి పేరు ఉంది. ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీస్ ఎండిగా ఆయన ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్నారు
ఐఏఎస్ లో 76 ర్యాంకు సాధించి న తెలుగు తేజం గా ఆయన యువతను ఆకర్షించిన విషయం తెలిసిందే. నెల్లూరు మున్సిపల్ కమిషనర్ గా నెల్లూరు అభివృద్ధికి ఎనలేని కృషి చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. రెవెన్యూ సమస్యలతో సతమతమవుతున్నఅనకాపల్లి జిల్లా రైతాంగానికి ఆయన విశిష్ట సేవలందించి మరింత మంచి పేరు తెచ్చుకోగలరని ఆశిద్దాం

