2027 ఏప్రిల్ నుంచి ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు

పైలట్ ప్రాజెక్టుగా రూ.10, రూ.20 నోట్ల విడుదల

వీ డ్రీమ్స్ న్యూడిల్లీ

దీర్ఘకాలం మన్నే పాలిమర్ (ప్లాస్టిక్) కరెన్సీ నోట్లను 2027 ఏప్రిల్ నుంచి పైలట్ ప్రాజెక్టుగా విడుదల చేయనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు.

తొలి దశలో రూ.10, రూ.20 విలువ కలిగిన నోట్లను ఒక్కో డినామినేషన్‌కు 100 కోట్ల చొప్పున మొత్తం 200 కోట్ల ప్లాస్టిక్ నోట్లు చలామణిలోకి తీసుకురానున్నారు.

సాధారణ కాగితపు నోట్లతో పోలిస్తే పాలిమర్ నోట్లు 2 నుంచి 4 రెట్లు ఎక్కువ కాలం మన్నుతాయని ఆర్‌బీఐ తెలిపింది. వాడుకలో ఎక్కువ మన్నిక, నాణ్యతను దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నట్లు పేర్కొంది.

అయితే ప్రస్తుతం చలామణిలో ఉన్న కాగితపు నోట్లను పూర్తిగా ఉపసంహరించే ఆలోచన లేదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. కాగితపు నోట్లు, ప్లాస్టిక్ నోట్లు రెండూ చట్టబద్ధంగా చెల్లుబాటులో కొనసాగుతాయని తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *