రెవెన్యూ కి చెలగాటం రైతుకి ప్రాణసంకటం

వీ డ్రీమ్స్ అనకాపల్లి

క్యాష్ చేతిలో పడితే చాలు చెరువులు,వాగులు, బంజర్లు , రహదారులను ప్రైవేట్ భూములుగా మార్చేయగల సమర్థత మన రెవిన్యూ శాఖకు ఉంది. విశాఖ నగర నడిబొడ్డున ఉన్న సర్కారు భూమిని మాజీ సైనికుల పేరిటపెట్టి ఆనక వారు దానిని రాజకీయ అండదండలు ఉన్న బడా బాబుల పరం
చేసిన చరిత్ర వారిది.
రికార్డులు సృష్టించ డంలో, మొత్తంగా లేపేయడంలో సిద్ధ హస్తులు. రెవెన్యూ రికార్డుల తప్పులు దిద్దమని చేతికిస్తే మరిన్ని తప్పులు చొప్పించి రీ సర్వే ని బ్రష్టు పట్టించ గల శక్తి కూడా వారిదే.రీ సర్వే తప్పుల సవరణ కాసులు కురిపించే మార్గమే కదా
అలాంటి వారిని పట్టుకుని రీ సర్వే సరిగాచేయలేదని ఎలా అనగలం బాబూ!
రీ సర్వే తప్పుల సవరణకై రెవిన్యూ సదస్సులు నిర్వహించ మంటే వచ్చిన అర్జీలను బుట్టలో వేసిన ఘనత మన రెవెన్యూ శాఖ దే కదా
ఆ అర్జీలను పరిష్కరించి ఉంటే పాస్ పుస్తకాల్లో తప్పులు వచ్చి ఉండేవి కావు రైతులకు కష్టాలు తప్పేవి

పిజిఆర్ఎస్ ను ప్రహసనం గా మార్చి రైతులను ఏడిపిస్తున్న కలెక్టర్లు ను వదిలేసి హడావిడి చేస్తే ఏం లాభం ?
రెవిన్యూ క్లినిక్ లో వస్తున్న అర్జీల్లో ఎన్ని పరిష్కారమయ్యాయి అనే విషయాన్ని కలెక్టరేట్ తెలియచెప్పడం లేదు. సక్సెస్ స్టోరీలను ప్రచురించమని ప్రభుత్వం ఆదేశిస్తే కలెక్టరేట్ల పనితీరు ప్రభుత్వానికి తెలుస్తుంది. ఫైల్ ట్రాకింగ్ వంటి రియల్ టైం గవర్నెన్స్, తప్పులు చేసిన ఉద్యోగులపై చర్యలు లేనం త కాలం రెవెన్యూ శాఖ ఆడిందే ఆట పాడిందే పాట

రీ సర్వే తప్పులను కూటమి సవరిస్తే కదా పట్టాదారు పాస్ పుస్తకాలు సరిగా వచ్చేవి.నిండా తప్పులు పెట్టుకుని రాజా ముద్ర తో ఇస్తే ఎం లాభం అంటున్నారు
గజపతి నగరం రైతులు.
.
పట్టాదారు పాస్ పుస్తకమా గ్రామఅడంగల్ చిట్టావా!!

ఓ పట్టా దారుపాస్ పుస్తకం లో గ్రామ అడంగల్ లో కొంత భాగం మొత్తంగా ప్రింట్ అయిపోయింది.
70 శాతం కి పైగా పాస్ పుస్తకాలు తప్పులతో నిండినవే.వీటిని సరిదిద్దుకోవడానికి మళ్లీ తిప్పలు. ఫార్మాలిటీస్ తప్పవు.

అనకాపల్లి మండలం పిసిని కాడ రైతు పెండ్యాల శ్రీకాంత్ పట్టాదార్ పాస్ పుస్తకం లో ఆయన భూమి వివరాలకు బదులు గ్రామ అడంగల్ లో కొంత భాగంను ముద్రించారు.

10 ఎకరాల ప్రభుత్వ భూమి ప్రైవేట్ ఖాతాలో

అనకాపల్లి మండలం కోడూరు గ్రామంలోని పది ఎకరాల 76 సెంట్ల (గయాలు) ప్రభుత్వ భూమిని ప్రైవేటు అకౌంట్లో చేర్చి పాస్ పుస్తకాన్ని విడుదల చేశారని తెలియ వచ్చింది

అనకాపల్లి మండలం పిసిన్ కాడ గ్రామంలో పూర్తి తప్పులు తడకలతో ముద్రించిన ఒక రైతు పట్టాదారు పాస్ బుక్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *