వీ డ్రీమ్స్ అనకాపల్లి
ఐదవ రోజు జనసందోహంతో కిటకిటలాడిన ఎన్టీఆర్ మైదానం
అనకాపల్లి జిల్లాలో ఉత్తరాంధ్ర ఇలవేల్పు నూకాంబిక అమ్మవారి రాష్ట్ర పండుగ మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకలలో భాగంగా స్థానిక ఎన్టీఆర్ మైదానంలో ఐదవ రోజు శనివారం సాయంత్రం ఆధ్యాత్మికత, సాంస్కృతిక వైభవం కలగలిపిన కార్యక్రమాలు అట్టహాసంగా నిర్వహించబడ్డాయి.మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ ఆధ్వర్యంలో, జనసేన పార్టీ ఇంచార్జ్ రామ్కీ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమాలు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉత్సాహంగా సాగాయి. విశాఖపట్నం సంగీత జనకలం (ఇంద్రగంటి కాళీ ప్రసాద్), మృదంగం (చాణిక్య) వారిచే భక్తి గీతాలు ప్రేక్షకులను భక్తి పరవశంలో ముంచెత్తగా, అనకాపల్లి సిరీస్ స్పందన నృత్యాలయం
(గిరిజస్పందన)విద్యార్థుల నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిరి శెట్టి, అమరావతి, బత్తుల రమేష్, మజ్జి అర్జున రావు, చొప్ప రమణ, విజయ్, దూడల సీత, పొనగంటి కాంతం,(మనభూమి) సత్యనారాయణ, (విజయ భాను) సురేష్, (సుమన్ టీవీ) నూకేష్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ వేడుకలను వీక్షించేందుకు అనకాపల్లి జిల్లా నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు, ప్రజలు ఎన్టీఆర్ మైదానానికి తరలివచ్చారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వ అధికారులు సమగ్ర ఏర్పాట్లు చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.భక్తి, సాంస్కృతిక రంగుల కలయికగా నిలిచిన ఈ వేడుకలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ జిల్లాలో ఉత్సవ వాతావరణాన్ని నెలకొల్పుతున్నాయి.ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పీలా నాగ శీను, ఈవో శ్రీధర్, ధర్మకర్తల మండల సభ్యులు, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ లు తిమ్మ పాత్రుని చక్రవర్తి, సకల గోవింద్, మరియు గండేపల్లి మురళి, రాష్ట్ర గవర కార్పొరేషన్ డైరెక్టర్ విల్లూరి హరికృష్ణ పాల్గొన్నారు


