నక్కపల్లిలో గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనను విజయవంతం చేయండి- మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్

వీ డ్రీమ్స్ అనకాపల్లి

రాష్ట్ర అభివృద్ధికి తల మానికంగా నిలవనున్న ఆర్సిలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఐటీ విద్యాశాఖ మాత్యులు నారా లోకేష్ అతి పెద్ద పారిశ్రామిక పెట్టుబడును అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం చందనాడ గ్రామంలో ఈనెల 23 సోమవారం సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేతుల మీదగా శంకుస్థాపన కార్యక్రమానికి అనకాపల్లి జిల్లా నుండి ప్రజానీకం తరలివచ్చి విజయవంతం చేయాలని ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకులతో మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు మొదటి దశలో 1,35,000 కోట్లు పెట్టుబడులు పెట్టడం వల్ల సుమారు 75 వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని నాగ జగదీష్ అన్నారు. స్టీల్ ప్లాంట్ రెండు విడతల్లో 5,300 ఎకరాల్లో ఏర్పాటు కానున్నదని, తొలి విడతలో 8.2 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్నారని 2029 నాటికి ఉత్పత్తి ప్రారంభించడానికి కంపెనీ ప్రతినిధులు చర్యలు తీసుకుంటున్నారని నాగ జగదీష్ అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన 20 నెలలో 6,28 లక్షల ఉద్యోగాలు కల్పించారని, అలాగే ఉగాది పండగ రోజున జాబ్ క్యాలెండర్ 10,060 ఉద్యోగాలకు ప్రకటన చేశారని, వైసిపి 5 సంవత్సరాల పాలనలో ఉపాధి అవకాశాలు లేక 4100 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారని, నిరుద్యోగ సమస్య 24% పెరిగిందని, ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగాలు 2,30,000 భర్తీ చేస్తామని యువతను మోసం చేశారని, జగన్ కు హిందూ పండుగలు, దేవుళ్లపై నమ్మకం లేదని, ఇంటి పక్కనే పెద్ద దేవాలయంలో ఉన్నప్పటికీ, అక్కడకు వెళ్లకుండా తాడేపల్లి ప్యాలెస్ లో సెట్టింగులు వేయించి ఫోటోలు తీసుకొని హిందువులను నమ్మించే ప్రయత్నాలు చేస్తున్న ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్న జగన్ రెడ్డికి హిందూమతస్తులపై చిత్తశుద్ధి లేదని, స్వామి వారి నైవేద్యం స్వీకరించడానికి ఇష్టపడక పేపర్ తో చుట్టి పక్కన పెడుతున్నారని మీడియా సాక్షిగా ప్రజలందరూ చూశారని, ఇటువంటి వ్యక్తికి రాజకీయాల్లో కొనసాగే నైతిక హక్కు లేదని నాగ జగదీష్ జగన్ రెడ్డి పై మండిపడ్డారు. గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమానికి జిల్లా ఇన్చార్జి మినిస్టర్ కొల్లు రవీంద్ర జిల్లా మంత్రివర్యులు హోం శాఖ మంత్రివర్యులు వంగలపూడి అనిత కేంద్ర మంత్రులు పెమసాని చంద్రశేఖర్ కుమారస్వామి శ్రీనివాసవర్మ పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు ప్రజా ప్రతినిధులు కూటమి తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులు, కార్యకర్తలు అశేషంగా పాల్గొని విజయవంతం చేయాలని నాగ జగదీష్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కాండ్రేగుల సత్యనారాయణ ఎలమంచిలి బంగారు రాజు కొమ్మోజు రామకృష్ణ పెంటకోట వెంకటరమణ కాండ్రేగుల రవీంద్ర కుప్పిలి జగన్ బోడి వెంకటరావు శ్రీకాకుళం గణపతి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *