వీ డ్రీమ్స్ అనకాపల్లి
నిర్వాసితులకు పూర్తిగా నష్ట పరిహారం చేల్లించే వరకు ఆర్సెల్లార్ మిట్టల్ నిప్పున్ స్టీల్ ప్లాంట్ భూమి పూజను వాయిదా వేయాలని ఆంధ్రప్రదేశ్ వ్వవసాయకార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు డి వెంకన్న డిమాండ్ చేసారు శనివారం అయిన ఓప్రకటన విడుదల చేసారు వైజాగ్ – చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్టులో భాగంగా నక్కపల్లి మండలంలో రాజయ్యపేట, బుచ్చిరాజు పేట చందనాడ, అమలాపురం, డిఎల్.పురం ఐదు పంచాయతీల పరిధిలో 11 గ్రామాల నుండి 5,500 ఎకరాల భూమి రైతుల నుండి జిరాయితీ భూమికి ఎకరాకు రూ.18 లక్షలు, డి. ఫారం భూమికి రూ.12 లక్షల 50 వేలు ఇచ్చి బలవంతంగా ప్రభుత్వం సేకరించిందని తెలిపారు.అందులో 2,100 ఎకరాల భూమిని ఆర్సెల్లార్ మిట్టల్ స్టీల్స్టాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం కేటాయించిందని, దీనికి అర్సెల్లార్ మిట్టల్ కంపెనీ ఎకరాకి రూ.53 లక్షలు ప్రభుత్వా నికి చెల్లించిందని పేర్కొన్నా రు.రైతుల భూములతో వ్యాపారం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నిర్వా సితులకు అన్యాయం చేస్తోందని విమర్శిం చారు.నిర్వాసితులైన రైతులు,కూలీలు,వత్తిదారులకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం ఇవ్వాల్సిన నష్టపరిహారం, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలు ఇప్పటి వరకు పూర్తిగా అమలు చేయ లేదన్నారు.నిర్వాసిత కాలనీలో ఎలాంటి సౌకర్యాలు కల్పించ కుండా, ఇళ్ల నిర్మాణం జరగకుండా ఆగ మేఘాల మీద ప్రస్తుతం నివ సిస్తున్న ఇళ్లు నేలమట్టం చేసి నిర్వాసితులను నడి రోడ్డుపై నెట్టి వేశారని తెలిపారు. జిరాయితీ భూములకు ఇచ్చిన నష్టపరి హారంతో సమానంగా డి- ఫారం సాగు భూములకు కూడా చెల్లించాలని కోరారు.వివాహ మైన ఆడపిల్లలకు, 18 సంవ త్సరాలు నిండిన ప్రతి యువతీ, యువ కులకు భూసేకరణ సందర్భంలో ఇచ్చిన హామీ ప్రకారం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, ఇంటి స్థలం ఇవ్వాలని, ప్రస్తుతం ఇచ్చిన ఆర్అండ్ఆర్ ప్యాకేజీ రూ.8,98,000 అంగీకారం కాదని, పెరిగిన ఇంటి నిర్మాణ సామాగ్రి ధరలకు అనుగుణంగా రూ.25 లక్షలకు పెంచి ప్యాకేజీ ఇవ్వాలని డిమాండు చేశారు.నిర్వాసితుల కాలనీలో విద్య, వైద్యం, విద్యుత్, నీటి సౌకర్యంతో పాటు 25 రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలని, భూములు కోల్పోయిన నిర్వాసితులకు ఆ ప్రాంతం లోనే ఉపాధి పనులు కల్పించాలని కోరారు సమస్య లను పరిష్కరించ కుండా నిర్వాసితుల హక్కులను అమలు చేయ కుండా ఆర్సెల్లార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంటు భూమి పూజ నిర్వహించడం అన్యాయమని, చట్ట విరుద్ధమని తెలిపారు.నిర్వాసితులుకు పూర్తిగా న్యాయం చేసెంత వరకు, భూమి పూజను వాయిదా వేయాలని, నిర్వాసితులకు న్యాయం చేయాలని వెంకన్న డిమాండ్ చేసారు.

