వీ డ్రీమ్స్ అనకాపల్లి
అనకాపల్లి ఆర్ ఇ సిఎస్ ను ప్రక్షాళన చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అనకాపల్లి శాసనసభ్యులు మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ అన్నారు.. పట్టణంలోని తన తండ్రి సుబ్రహ్మణ్యం ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ శాఖలో విలీనమైన తర్వాత ఉద్యోగులు వినియోగదారులు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు .పాలిటెక్నిక్ కళాశాలలో ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వలేని పరిస్థిటీ ఉందన్నారు. అత్యధికంగా ఆదాయం వస్తున్నప్పటికీ విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోవటం లేదన్నారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. తిరిగి ఆర్ఈసీఎస్ పరిధిలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే తుమ్మ పాల షుగర్ ఫ్యాక్టరీని తెరిపించే అవకాశం లేదుగానీ అక్కడ ఇందనాల్ ఫ్యాక్టరీ గాని మరో పరిశ్రమ గాని తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అలాగే అనకాపల్లి జీవీఎంసీ జోనల్ పరిధిలో మరమ్మతులు నిమిత్తం లక్షలాది రూపాయలు దుర్వినియోగం జరిగిందన్నారు. ప్రతి ఏటా మరమతులకు లక్షల రూపాయలు వాడుతున్నట్లు చెబుతున్న అటువంటి ఛాయలు కనిపించడం లేదన్నారు. కొత్త భవనం నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై అధికారులకు విజ్ఞప్తి చేయడం జరిగిందని విచారణ చేపట్టాలని విజిలెన్స్ ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉందని తెలిపారు. కమిషనర్ తో ఇదే ఈ విషయం చర్చించడం జరిగిందన్నారు .అలాగే పెరుగు బజారు రోడ్డు విస్తరణ పనులు జరగాల్సి ఉందన్నారు 22ఏ లో కొన్ని భవనాలు ఉండటం వారికి టీడీఆ ర్ ఇవ్వలేకపోవడం వల్ల పనులు నిలిచిపోయాయని చెప్పారు .దీనిపై కలెక్టర్ తో మాట్లాడం జరిగిందన్నారు. త్వరలోనే 22 ఏ నుండి వాటిని తొలగించి అవసరమైన వారికి ఇవ్వాల్సిన టిడిఆర్లు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు అని అందుకే ఆలస్యం అయిందని చెప్పారు. అలాగే అనకాపల్లి జిల్లాకు మౌలిక సదుపాయాలు కల్పించవలసిన అవసరం ఉందన్నారు. అన్ని ప్రభుత్వ భవనాలు ఒకే చోట ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు .చెర్లోపల ఖు oడం లేఅవుట్ పనులు త్వరలో ప్రారంభించేందుకు అవసరమైన ప్రణాళికను సిద్ధం అవుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో అమరావతి పోలవరం ప్రాజెక్టులను రెండు కళ్ళుగా భావించి నిర్మాణ పనులు కు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని తెలిపారు. అలాగే సంక్షేమo అభివృద్ధి రెండు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నాయని తెలిపారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆదోగతిపాలు చేసిందని విమర్శించారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు నీల బాబు కర్రీ సత్య నారాయణ తదితరులు పాల్గొన్నారు