వీ డ్రీమ్స్ తెనాలి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి అధికారంలోకి రావాలని కోరుకుంటూ లోక్ సత్తాపార్టీ జాతీయ నేత డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ మద్దతు నివ్వడం టిడిపి, జనసేన, బీజేపీల ఎన్డీయే కూటమికి చాలా బలం చేకూరిందని జనసేన పీఏసీ చైర్మన్, కూటమి తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి నాదెండ్ల మనోహర్ అన్నారు లోక్ సత్తాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి తో కలిసి గురువారం తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ని జరుగుతున్న రాజకీయ పరిణామాలను ఎప్పటికప్పుడు జేపీ పరిశీలించారని అందుకే యువతకి మంచి ప్రాధాన్యత ఇవ్వాలనుకునే కూటమికి మద్దతు తెలిపారని,జనసేన పార్టీ తరపున జయప్రకాష్ నారాయణ్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని,దారి తప్పిపోతున్న సమాజాన్ని గాడిలో పెట్టేందుకు జేపీ నిరంతరం కృషి చేస్తున్నారని,నాదెండ్ల మనోహర్ అన్నారు,లోక్ సత్తాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు ఎన్డీయే కూటమికి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని ,రాష్ట్రం అన్ని రంగాల్లో కుంటుపడిందని ముక్యంగా రాష్ట్రంలో ని వ్యవసాయ రంగం, సాగు,త్రాగునీరు ప్రోజెక్టులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో నిర్లక్ష్యం చేసారని భీశెట్టి మండిపడ్డారు,కూటమికి మద్దతు ఇస్తూ జయప్రకాష్ నారాయణ్ తీసుకున్న నిర్ణయం పై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అన్నారు,జేపీ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ని ముఖ్య నియోజకవర్గాలు పర్యటిస్తున్నానని ఆయన చెప్పారు,ఈ సమావేశంలో నియోజకవర్గ జనసేన నాయకులు పాల్గొన్నారు.