త్వరలో ” అమెరికా ” గా మారనున్న అనకాపల్లి

దేశ చరిత్ర లో అత్యంత ఖరీదైన హామీ

గిన్నిస్ బుక్ లో ఎక్కనున్న భరత్

వీ డ్రీమ్స్ అనకాపల్లి

పార్లమెంటు ఎన్నికల్లో కేవలం 9 ఓట్లతో నెగ్గి దేశంలో అనకాపల్లి కి మాజీ ఎంపీ కొణతాల రామకృష్ణ ఒక పేరు తీసుకువచ్చారు. ఇపుడు అనకాపల్లి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన మలసాల భరత్ కుమార్ మాత్రం దేశచరిత్రలో అత్యంత ఖరీదైన హామీ ఇచ్చి సంచలనం సృష్టించారు. అనకాపల్లి ని ఏకంగా అమెరికా గా మార్చేస్తానని అపురూపమైన హామీ ని ప్రజలకు ఇచ్చేసారు. విశాలమైన రోడ్లు, అద్భుతమైన ప్లై ఓవర్ బ్రిడ్జి లు, విలాసవంతమైన షాపింగ్ మాల్స్, ఖరీదైన బార్లు, ప్రతి ఒక్కరికీ ఒక కారు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లు మోడరన్ దుస్తులతో ఆడ, మగ…ఇలా ఊహించుకుంటే ఎంతో అధ్బుతంగా ఉంది. ఈ కల సాకారం కావాలంటే ప్రతి ఒక్కరూ భరత్ కు ఓటు వేయాల్సిందే. ఈయన గురువు (అమర్) అనకాపల్లి ని అందాల పల్లిగా మారుస్తానని హామీ ఇచ్చారు. ప్రజలు నమ్మి ఓట్లు వేసారు. ఈ అందాల పల్లిలో ప్రజలు ఇపుడు హాయిగా ఉన్నారు. ఆయన స్ఫూర్తితో ఇపుడు మన భరత్ అనకాపల్లి ని ఏకంగా అమెరికా గా మార్చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలంతా ఇపుడు 13 తేదీ కోసం ఎదురు చూస్తున్నారు. ఎంత వేగంగా పోలింగ్ తేదీ వస్తుందా…భరత్ ను ఓటుతో గుద్దేయాలని ప్రజలు ఉత్కంఠ తో ఎదురు చూస్తున్నారు. వైసీపీ నాయకులు చెప్పారంటే చేస్తారు మరి. అంత నమ్మకం ఆ పార్టీ పై. భరత్ ఇచ్చిన హామీ చూసి ప్రధాని మోడీ కూడా సిగ్గుతో చితికిపోతున్నారట ? ఇంత పెద్ద దేశాన్ని అమెరికా గా మార్చలేకపోయా… అమెరికా నుంచి వచ్చిన యువకుడు భరత్ అనకాపల్లి ని అమెరికా గా మార్చేస్తానని చెప్పాడంట…సిగ్గు తెచ్చుకోండి అంటూ బీజేపీ శ్రేణులను మందలించినట్లు సమాచారం. ఇక అనకాపల్లి యువకుల ఆనందానికి అవధులు లేవట. ఎందుకంటే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు అనకాపల్లి కి క్యూ కడతారు. పిలిచి మరీ ఉద్యోగాలు ఇస్తారంటూ కలలు కంటున్నారు. మరోవైపు ప్రపంచంలో అత్యంత ఖరీదైన హామీ ఇచ్చిన భరత్ ను గిన్నిస్ బుక్ లో ఎక్కించాలంటూ వారు అనకాపల్లి బయలుదేరారట. మనం కూడా భరత్ కు జై కొడదామా మరి,….

Author: vdreams

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *