వీ డ్రీమ్స్ అనకాపల్లి
దివంగత పీలా మహాలక్ష్మి నాయుడు 14 వ వర్ధంతి సందర్భంగా అనకాపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీసీ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ మల్ల సురేంద్ర మాట్లాడుతూ ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు నుండి తెలుగుదేశం పార్టీ కీ సేవలు అందించి, సమితి అధ్యక్షునిగా, ఎంపీపీగా, పదవుల అలంకరించి, క్రమశిక్షణ గల నాయకుడిగా ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న పీలా మహాలక్ష్మి నాయుడు వారసులు పీలా గోవింద సత్యనారాయణ అనకాపల్లి ఎమ్మెల్యేగా చేసి ప్రజల్లో మంచి పేరు పొందారని, వారి రెండో కుమారుడు పీలా శ్రీనివాసరావు రాష్ట్ర నాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకొని త్వరలో విశాఖపట్నం మేయర్ గా బాధ్యతలు చేపట్టే అవకాశం తెలుగుదేశం పార్టీ కల్పిస్తుందని అన్నారు. తెలియజేస్తూ, ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కొణతాల నూక నాయుడు, సంధిన సునీల్, కాండ్రేగుల చిన్న, వేగి కృష్ణ, పైలా గోపి, ఆళ్ల జగదీ, అర్జున్, బోస్, వేదుళ్ళ సూర్యప్రభ, జామిరాజు, రఘు, కర్రి మహాలక్ష్మి నాయుడు, అధిక స్థాయిలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.