వీ డ్రీమ్స్ అనకాపల్లి
తగరంపూడి గ్రామంలో రైతు భరోసా కేంద్రంలో వరి విత్తనాలు పంపిణీ కార్యక్రమాన్ని జనసేన పార్టీ సీనియర్ నాయకులు పూసపాటి భరత్ బాబు సోమవారం ప్రారంభించారు. ఎన్డీఏ కూటమి ద్వారా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ , నియోజవర్గ ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ,రైతే రాజు , రైతే దేశానికి వెన్నుముక అనే ఉద్దేశంతో రైతులందరికీ మేలు జరుగుటకు సబ్సిడీ ద్వారా విత్తనాలు పంపిణీ కార్యక్రమాన్ని ప్రతి పంచాయతీలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా తగరంపూడి పంచాయతీలో విత్తనాల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మండల జనసేన నాయకులు టిడిపి నాయకులు నడింపల్లి శ్రీనివాస రాజు, అలాగే టిడిపి బిజెపి జనసేన నాయకులు , కప్పిరి తాతారావు, పప్పల శీను, తమ్మన సుబ్రహ్మణ్య గుప్త, నాగులపల్లి అప్పల స్వామి నాయుడు, నడిగట్ల శ్రీను, నాగులపల్లి లోకేష్, కాకి సోమరాజు, బోధ శీను, పట్టా కృష్ణ,నందవరపు శ్రీను,ముమ్మిన జ్ఞానేశ్వరావు,నక్క చెల్లయ్య,ముమ్మిన గోవింద్, బండారు రామారావు,బోయిన శీను , మేకల ఈశ్వరరావు, నాగులపల్లె తాతలు,పాతాళ బాబురావు మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు.
రైతులకు సబ్సిడీపై వరి విత్తనాలను పంపిణీ ప్రారంభించిన పూసపాటి భరత్ బాబు