వీ డ్రీమ్స్ అనకాపల్లి
ప్రభుత్వ స్థలాలను గుర్తించి వాటిని కాపాడాలని రెవెన్యూ అధికారులను ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ఆదేశించారు. ఆయన అనకాపల్లి మండలం కొత్తూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న శారదా నది గట్టు తో పాటు చెరువును కలెక్టర్ విజయ్ కృష్ణన్ తో కలిసి పరిశీలించారు. చెరువు నిండితే ఎన్జిఒ కోలనీ ముంపుకు గురౌతుందని నీటి ముంపు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు పంచాయతీ రాజ్ శాఖ కు చెందిన భూమిని సర్వే జరిపి ఆక్రమణలు లేకుండా చూడాలని అన్నారు. అనంతరం వీరు తుమ్మపాల బొజ్జన్న కొండ సమయంలో ఏలేరు కాలువ గట్టును కూడ పరిశీలించారు. ఇక్కడ కూడ ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని ఆయన ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట ఆర్డీఒ షేక్‌ఆయేషా, మండల తహసీల్దారు విజయ్ కుమార్, మండల సర్వేయర్ మొహన్, ఎంపిటీసి చదరం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
