వీ డ్రీమ్స్ బుచ్చెయ్యపేట
ప్రభుత్వ భూములపై కన్నేసేవారికి వాటిని ధారాదత్తం చేయడం, కబ్జా దారులకు కొమ్ముకాయడం, చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి సైతం వేలు, లక్షలు వసూలు చేయడం రెవెన్యూ శాఖలో పరిపాటే కుబేరులవతున్న రెవెన్యూ అధికారులు గురించి వింటున్నాం. రోజు మీడియాలో ఈ కథనాలు వస్తున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోంది. అక్రమ లేఔట్లు వేసేవారి నుంచి, పరిహారల మంజూరు లో లక్షలు, కోట్లు దర్జాగా మడతేస్తున్న రెవెన్యూ ఉన్నతాధికారుల సమాచారం బైటికి పొక్కుతూనే ఉంది. ఇప్పుడు తాజాగా సాగునీటి చెరువుని కబ్జా చేసిన ఒక రెవెన్యూ అధికారి ఉదంతం వెలుగులోకి వచ్చింది.
బుచ్చియ్యపేట మండలం తురకలపూడి రెవెన్యూ గ్రామం లో సర్వే నెం 191లో సోమి నాయిడు చెరువు విస్తీర్ణం సుమారు 80 ఎకరాలు కాగా ఇందులో నాలుగు ఎకరాలను ఒక విఆర్ఒ ఆక్రమించుకున్నాడు ఆ నాలుగు ఎకరాల్లో సరుగుడు తోట వేసి బాగా ఎదిగిన తర్వాత విక్రయించేసాడు. తురకలపూడి గ్రామ పంచాయతీ విఆర్ఒ ఆక్రమణ భూమిలో సరుగుడు తోట వేసుకొనేందుకు అనుమతి ఇచ్చింది! ఆ మేరకు ఒక తీర్మానాన్ని కూడా ఆమోదించి నట్లు తెలిసింది. తోట అమ్మగా వచ్చిన డబ్బు ప్రభుత్వానికి కానీ, గ్రామ పంచాయితీకి జమ చెయ్యలేదని తెలిసింది. ఈ ఉదంతం పై ఆర్.టి.ఐ కార్యకర్త ఒకరు రాష్ట్ర భూ పరిపాలన అధికారికి, అనకాపల్లి జిల్లా కలెక్టరు, జాయింట్ కలెక్టర్ కి పిర్యాదు చేసారు., నీటి వనరులను ఎవరు ఆక్రమించరాదని గతంలో సుప్రీమ్ కోర్టు ఆదేశించినప్పటికీ సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. ఈ ఆక్రమణ ఉదంతం పై తహసీల్దారు కి ఫోన్ చేయగా ఆమె స్పందించలేదు.అలాగే అనకాపల్లి ఆర్డీఒ షేక్ ఆయేషా ని సంప్రదించగా నేరుగా పరిశీలన చేస్తానని ఆక్రమణ ఉంటే చర్యలు తప్పవని తెలిపారు.
