వీ డ్రీమ్స్, అనకాపల్లి
జిల్లాలోని పైలట్ గ్రామాలన్నింటిలో రీ సర్వే పనులు వేగవంతం అయ్యాయి. నోటీసులు అందజేసే ప్రక్రియ పూర్తి చేసుకుని భూమి రికార్డుల పరిశీలన, స్వచ్చీకరణ కార్యక్రమాలు ప్రారంభించారు. ఇప్పటికే గ్రామ సరిహద్దులు, బ్లాకుల సరిహద్దుల గుర్తింపు పూర్తి అయ్యిందని సర్వే అధికారులు చెప్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో మాదిలా కాకుండా తగినంత మంది సిబ్బంది, సమయం ఉన్నందున ప్రక్రియను సులభతరం చేసి నందున ఈ సారి సర్వే పక్కాగా జరుగుతుందని వారు దీమా వ్యక్తం చేసారు. రెవెన్యూ సిబ్బంది రైతులు సహకరిస్తే వందేళ్ల కిందట జరిగిన సర్వే మాదిరిగా రీ సర్వే కూడా విజయవంతం అవుతుందని వీరంటున్నారు.
గతేడాది జరిగిన రీ సర్వే అర్జీల పై విచారణ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. జిల్లా అధికారులు దీనిపై శ్రద్ధ తీసుకో నందున తహసీల్దారు లు ఈ పనులకు ప్రాధాన్యం ఇవ్వడం లేదనే విమర్శలు వస్తున్నాయి.. సర్వే రాళ్ల పై జగన్ బొమ్మలు తొలగించే పనులు కూడా అంతంత మాత్రం గానే జరిపి నిలిపివేశారు.
