వీ డ్రీమ్స్, అనకాపల్లి
రాజుపాలెం సూర్యనారాయణ స్వామి దేవాలయం లో రేపు జరగనున్న రథసప్తమి వేడుకలకు అన్ని ఏర్పాటు చేసామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని వారు తెలిపారు. తెల్లవారుజామున మూడు గంటల నుండి భక్తులు స్వామి వారిని దర్షించు కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేసామని అన్నారు.ఈ వేడుకల్లో భాగంగా మంగళవారం ఉదయం పది గంటలు నుండి స్వామి వారి కల్యాణ మహోత్సవం జరుగుతుందని అన్నారు.ఈ కళ్యాణ మహోత్సవం లో భక్తులు పెద్ద పాల్గొని స్వామి వారి కృపను పొందాలని అన్నారు. స్వామి వారిని దర్షించుకొనెందుకు వచ్చే భక్తులు తమ వాహనాలను పార్కింగ్ ప్లేస్ లో పెట్టాలని అన్నారు.
