వీ డ్రీమ్స్ అనకాపల్లి
ప్రతి ఒక్కరు రీ సర్వే కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని అనకాపల్లి డిప్యూటీ తహసీల్దారు యలమంచిలి శ్రీరామమూర్తి తెలిపారు. శనివారం తగరంపూడి, మామిడి పాలెం గ్రామాల్లో రీ సర్వే గ్రామ సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా తగరంపూడి ఆర్బికే భవనంలో నిర్వహించిన గ్రామ సభలో ఆయన మాట్లాడుతూ రీ సర్వే నిర్వహించేటప్పుడు రైతులు అందరూ అందుబాటులో ఉండాలని సూచించారు. అలాగే రీ సర్వే జరిగేటప్పుడు అధికారులు అడిగినప్పుడు తమ వద్ద ఉన్న రికార్డులను చూపించాలని అన్నారు. ప్రభుత్వం పకడ్బందీగా ఈ రీ సర్వే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించింది అని అన్నారు. పైలెట్ గ్రామంగా కొండు పాలెం లో రీ సర్వే పూర్తి చేసామన్నారు.తప్పులు లేకుండా రికార్డులను తయారు చెయ్యాలని రెవెన్యూ సిబ్బంది కి సూచించారు. ఈ కార్యక్రమం లో డిప్యూటీ సర్వేయర్ వెంకన్న,మండల సర్వేయర్ మొహన్,విఆర్ఒ సూరిబాబు, జనసేన పార్టీ నాయకులు పప్పల శ్రీనివాసరావు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
