వీ డ్రీమ్స్ అనకాపల్లి
జ్యోతి రావ్ పూలే గొప్ప సంఘ సంస్కర్త అని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు,మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగ జగదీశ్వరరావు అన్నారు. శుక్రవారం స్దానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జ్యోతి రావ్ పూలే 199 వ జయంతి సందర్భంగా చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ జ్యోతి రావ్ పూలే సమాజంలో జరుగుతున్న అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలన తో పాటు మహిళోద్దరణకు విశేషంగా కృషి చేసారన్నారు.దిగువ కులాల ప్రజలకు సమాన హక్కు లను పొందటానికి విశేషంగా కృషి చేసారని అన్నారు. దేశంలోనే తి బాలికల పాఠశాల ను ప్రారంభించిన మహోన్నత వ్యక్తి జ్యోతి రావ్ పూలే అని అన్నారు. ఆయన ఆలయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పని చెయ్యాలని అన్నారు. సంఘ సంస్కర్త సత్యశోధక సమాజ స్థాపకుడు జ్యోతిరావు పూలే 199 వ జయంతి పురస్కరించుకొని అనకాపల్లి పార్లమెంట్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు మాజీ శాసనమండలి సభ్యులు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుద్ధ నాగ జగదీశ్వరరావు ఆధ్వర్యంలో పూలే చిత్రపటానికి పుష్పమాల అలంకరించి ఘనమైన నివాళులర్పించారు. ఈ సందర్భంగా తాతయ్య బాబు నాగ జగదీష్ మాట్లాడుతూ పూలే సమాజంలో జరుగుతున్న అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు విశేషమైన కృషి చేశారని, దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందడానికి సత్యశోధక సమాజ్ ను ఏర్పాటు చేశారని, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడ్డారని, సంఘములో అన్ని మతాలు కులా బాలికా పాఠశాలను ప్రారంభించారని అన్నారు. జ్యోతి రావ్ పూలే ఆశయాలను విస్తరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భోగలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ కాండ్రేగుల సత్యనారాయణ కుప్పిలి జగన్ మల్ల గణేష్ సాలాపు నాయుడు బోడి వెంకటరావు బుద్ధ భువనేశ్వరరావు యలమంచిలి బంగారు రాజు దాడి వేణు వేగి వెంకటరావు విల్లూరి రమణబాబు కొణతాల బాల తదితరులు పాల్గొన్నారు.
